ముంబైలో భారీ ల్యాండ్​ డీల్.. 22 ఎకరాలకు రూ. 5 వేల 200 కోట్లు

ముంబైలో భారీ ల్యాండ్​ డీల్.. 22 ఎకరాలకు రూ. 5 వేల 200 కోట్లు

ముంబై :  దేశపు ఫైనాన్షియల్​ క్యాపిటల్​గా పేరొందిన ముంబై సిటీలో భారీ ల్యాండ్​ డీల్​ ఒకటి కుదిరింది. జపాన్​ రియల్​ ఎస్టేట్​ కంపెనీ సుమిటొమో తమ నుంచి రూ. 5,200 కోట్లకు 22 ఎకరాల స్థలాన్ని కొంటున్నట్లు వాడియాలు నడిపే బాంబే డైయింగ్​ కంపెనీ బుధవారం ప్రకటించింది. సెంట్రల్​ ముంబైలోని వర్లి వద్ద ఈ స్థలం ఉంది. సుమిటొమో సబ్సిడరీ కంపెనీ గోయిసు రెండు దశలలో స్థలానికి డబ్బు చెల్లించనుంది.

ALSO READ: సైనికుడి కోసం ఆర్మీ కుక్క ప్రాణత్యాగం

మొదటి దశలో రూ. 4,675 కోట్లను, కొన్ని కండిషన్లు నెరవేర్చిన తర్వాత మరో రూ. 525 కోట్లను ఆ కంపెనీ చెల్లిస్తుందని బాంబే డైయింగ్​ స్టాక్​ ఎక్స్చేంజీలకు తెలిపింది. అమ్మకానికి ఆమోదం తెలిపేందుకు బాంబే డైయింగ్​ డైరెక్టర్ల బోర్డు బుధవారం సమావేశమైంది. ఈ ప్రపోజల్​కు షేర్​హోల్డర్ల ఆమోదం కూడా అవసరం. ల్యాండ్​ సేల్​ నేపథ్యంలో బీఎస్​ఈలో బాంబే డైయింగ్​ షేరు 6.93 శాతం ఎగసి రూ. 140.45 వద్ద క్లోజయింది.