సైనికుడి కోసం ఆర్మీ కుక్క ప్రాణత్యాగం

సైనికుడి కోసం ఆర్మీ కుక్క ప్రాణత్యాగం

రాజౌరీ/జమ్మూ :  జమ్మూ కాశ్మీర్​లో జరిగిన ఎన్ కౌంటర్​లో ఓ సైనికుడిని రక్షించే క్రమంలో కెంట్ అనే ఆర్మీ ఫీమేల్​డాగ్​ప్రాణాలు కోల్పోయింది. రాజౌరీ జిల్లాలోని మారుమూల నార్లా గ్రామంలో మంగళవారం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్​ టెర్రరిస్ట్ గా భావిస్తున్న ఓ వ్యక్తిని సైనికులు మట్టుబెట్టారు. అయితే, ఆర్మీ డాగ్​తో పాటు ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సోల్జర్ల​కు గాయాలయ్యాయి. ‘‘ఆర్మీ డాగ్ యూనిట్​లోని లాబ్రడార్ జాతికి చెందిన కెంట్ తన హ్యాండ్లర్​ను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించింది.

ALSO READ: కరెంట్​ షాక్​ పెట్టి ఆవులను చంపేసిన్రు

ఆపరేషన్ సుజలిగలలో కెంట్ ​ముందంజలో ఉంది. టెర్రరిస్టులను గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ లో కెంట్ సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తోంది. భారీ ఎదురుకాల్పుల్లో తన హ్యాండ్లర్​ను రక్షించే క్రమంలో బుల్లెట్ గాయాలపాలై కన్నుమూసింది’’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లోని రాజౌరి జిల్లా నార్లా గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌‌‌‌లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో మరో టెర్రరిస్ట్​ హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా, కెంట్​కు సైన్యం నివాళులు అర్పించింది. దేశం కోసం కెంట్​ చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ.. సెర్చ్ ఆఫ్​ డ్రిల్‌‌‌‌లో సైనికులను కెంట్ ముందుండి నడిపించిన వీడియోను ఎక్స్​లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

మరో ఘటనలో ముగ్గురు..

అనంత్​నాగ్​లో జరిగిన మరో ఎన్ కౌంటర్​లో కర్నల్​ మన్ ప్రీత్​ సింగ్​, మేజర్ ఆశిష్​ ధోన్ చక్​, డిప్యూటీ సూపరింటెండెంట్​ హుమాయున్ భట్​ చనిపోయారని అధికారులు తెలిపారు.