ప్రవీణ్​రెడ్డిని కాంగ్రెస్​లో ఎట్ల చేర్చుకుంటరు?

ప్రవీణ్​రెడ్డిని కాంగ్రెస్​లో ఎట్ల చేర్చుకుంటరు?
  • ప్రవీణ్​రెడ్డిని కాంగ్రెస్​లో ఎట్ల చేర్చుకుంటరు?
  • టికెట్​పై స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తా 
  • నా తండ్రి సేవలకు ఇదేనా గుర్తింపు? 
  • కరీంనగర్ లో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 

కరీంనగర్, వెలుగు : మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో హుస్నాబాద్ హస్తం పార్టీలో చిచ్చు మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ చేరిన ప్రవీణ్ రెడ్డి బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్​ కాబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుకున్న  ప్రస్తుత నియోజకవర్గ ఇన్​చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి మంగళవారం కరీంనగర్ లోని తన ఇంట్లో హుస్నాబాద్ ప్రాంత కాంగ్రెస్ లీడర్లతో సమావేశమయ్యారు. గత పార్లమెంట్​ఎన్నికల టైంలో కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి  ఎందుకు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏండ్లుగా నియోజకవర్గంలో దివంగత మాజీ ఎమ్మెల్యే  బొమ్మ వెంకన్న(శ్రీరాం చక్రవర్తి తండ్రి) పార్టీకి చేసిన సేవలకు ఇదేనా గుర్తింపు అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చేరిక విషయాన్ని పార్టీ అధిష్టానం జిల్లా నాయకత్వానికి చెప్పకపోవడం ఏమిటన్నారు. కాంగ్రెస్​ హైకమాండ్​ తనకు టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.