గాంధారీ మైసమ్మ తల్లికి ఘనంగా పూజలు

గాంధారీ మైసమ్మ తల్లికి ఘనంగా పూజలు

కోల్​బెల్ట్, వెలుగు: ఆషాఢ మాస బోనాల వేడుకలు మందమర్రి, రామకృష్ణాపూర్​ పట్టణాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆలయానికి భక్తులు పొటెత్తారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మందమర్రి పట్టణం ఇల్లందు క్లబ్​లో సింగరేణి సేవా సమితి, లేడీస్​క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు నిర్వహించారు. 

సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు, జీఎం సతీమణి స్వరూప రాణి,సెక్రటరీ మనీ, ట్రెజరర్ కవిత, జాయింట్ ట్రెజరర్ సుజాత, కమిటీ మెంబర్స్, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్​లోని బీజోన్​లో రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య సీతాలమ్మదేవి బోనాలు ఘనంగా నిర్వహించారు.