
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం టీఎన్జీవో గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో శ్రావణ మాస బోనాలు నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయానికి సిబ్బంది బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
టీజీవో హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఎంబీ కృష్ణయాదవ్, గాంధీ టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్డాక్టర్ సునీల్, ఆర్ఎంవో- 1 డాక్టర్ శేషాద్రి,హెచ్వోడీ ప్రొఫెసర్ కృపాల్ సింగ్, మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.