పటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు 

పటాన్చెరులో బోనాల సంబురం .. ఫలహార బండి ఊరేగింపు 

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరు పట్టణంలో సోమవారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం నుంచి ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సతీమణి యాదమ్మతో కలిసి ఏడుగుల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించారు. కొద్దిసేపు నృత్యం చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత పట్టణంలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు  చేశారు. బోనాల సందర్భంగా శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీఐ వినాయక్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.