
ఫస్ట్‌డే స్కూల్‌కు రాలేదంటూ గురుకుల స్టూడెంట్స్‌ను లోనికి రానివ్వలేదు. నాలుగు గంటలపాటు స్టూడెంట్లతోపాటు తల్లిదండ్రులు బయటే నిలబడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న చిన్న బోనాల గురుకుల స్కూల్లో చోటుచేసుకుంది. వేసవి సెలవులకు చిన్న బోనాలతోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్స్కూల్స్టూడెంట్స్అంతా ఇంటికి వెళ్లారు.
జూన్ 12 స్కూల్స్తెరిచారు. దూరప్రాంతాల్లో ఉండే దాదాపు 200 మంది స్టూడెంట్స్13న గురువారం స్కూల్‌కు వచ్చారు. ఆలస్యంగా రావడం రూల్స్‌కు విరుద్ధమంటూ వారిని ప్రిన్సిపల్ స్కూల్లోకి అనుమతించలేదు. కరీంనగర్ లోని రీజనల్ కోఆర్డినేటర్నుంచి పర్మిషన్లెటర్ తీసుకువస్తేనే లోపలికి రానిస్తామన్నారు. దీంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు వెంట తెచ్చుకున్న లగేజీ ఎక్కడ పెట్టుకోవాలి, మళ్లీ కరీంనగర్ వెళ్లి లెటర్ ఎట్లా తీసుకురావాలో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. నాలుగు గంటలపాటు బయటే నిల్చున్నారు. చివరకు స్టూడెంట్లతో లెటర్ రాయించుకుని తర్వాత స్కూల్లోకి అనుమతించారు.