బోనాల జాతర: మార్మోగిన పాతబస్తీ

బోనాల జాతర: మార్మోగిన పాతబస్తీ

పాతబస్తీలో బోనాల జాతర అంబరాన్నంటింది. ఉత్సవాల్లో రెండో రోజు సోమవారం ఘటాల ఊరేగింపు వైభవంగా సాగింది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి సాయంత్రం అంబారీపై అమ్మవారి ఊరేగింపును సిటీ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. దేశభక్తి, దైవభక్తి జోడించి  వినూత్న రీతిలో అలకరించిన 29 ఆలయాలకు చెందిన ఘటాలను ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో లాల్​దర్వాజ, మీర్ ఆలం మండి, పురానా పూల్, శాలిబండ ప్రాంతాల నుంచి చార్మినార్ మీదుగా మదీనా చౌరస్తా, నయాపూర్ ఢిల్లీ దర్వాజ వరకు ఊరేగించారు. మతసామరస్యాన్ని చాటుతూ  ముస్లింలు ప్రసాదం పంచారు.