
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ ఈ నెలలో తన 27 ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కంపెనీ వరుస ఆఫర్లను ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి గూగుల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా పిక్సెల్ మెుబైల్స్, యాక్సిసరీస్ పైన ప్రత్యేక ఆఫర్‌లను అందించాలని డిసైడ్ అయ్యింది. వీటిలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్ తో పాటు స్మార్ట్‌ఫోన్‌లు, వాచెస్, ఇయర్‌బడ్స్ పై బండిల్ డీల్స్ ప్రకటించింది.
ఈ క్రమంలో గూగుల్ పిక్సెస్ 10ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ కొన్న యూజర్ల గూగుల్ వాలెట్లోకి నేరుగా $100 ప్రీపెయిడ్ మాస్టర్‌కార్డ్‌ను అందుకుంటారు. ఈ ఆఫర్ ఇప్పటికే కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చేసింది. కొనుగోలుదారులు అర్హత కలిగిన వస్తువులు షాపింగ్ చేయటం ద్వారా మూడు ప్రీపెయిడ్ కార్టులను పొందొచ్చని కంపెనీ వెల్లడించింది.
ఇదే క్రమంలో కంపెనీ తన పిక్సెల్ వాచ్ 4 కొన్న యూజర్లు 350 డాలర్ల వరకు పొందొచ్చని ఇది అక్టోబర్ 12 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పింది. అలాగే బడ్స్ ప్రో 2ను 50 డాలర్ల తగ్గింపు రేటు అంటే 179 డాలర్లకే దక్కించుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు అవకాశం ఉన్నట్లు గూగుల్ చెప్పింది. అలాగే గూగుల్ పిక్సెల్ 8 ప్రో పై 400 డాలర్ల తగ్గింపుతో పాటు పిక్సెల్ వాచ్ 2 ఎల్టీఈ ఉచితంగా పొందొచ్చని చెప్పింది. అలాగే గూగుల్ పిక్సెల్ 9 రేటును 100 డాలర్ల మేర సెప్టెంబర్ 28 వరకు తగ్గిస్తున్నట్లు కంపెనీ చెప్పింది. ఇదే క్రమంలో గూగుల్ యూజర్లకు తన ఉత్పత్తుల లోగోలతో కూడిన స్టికర్స్ షీటును కూడా అందిస్తోంది.