సిటీతో బంధం.. పాలనపై పట్టు.. హైదరాబాద్ కొత్త కలెక్టర్గా హరిచందన

సిటీతో బంధం.. పాలనపై పట్టు.. హైదరాబాద్ కొత్త కలెక్టర్గా హరిచందన
  • ప్రస్తుతం ఆర్​అండ్​బీలో స్పెషల్​ సెక్రటరీగా బాధ్యతలు 
  • నల్గొండ, పేట కలెక్టర్​గా చేసిన అనుభవం 
  • బల్దియా జోనల్​ కమిషనర్​గానూ సేవలు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్​కొత్త కలెక్టర్​గా​ దాసరి హరిచందనను నియమించారు. ఇక్కడ పని చేస్తున్న అనుదీప్​ దురిశెట్టిని ఖమ్మం జిల్లా కలెక్టర్​గా ట్రాన్స్​ఫర్​ చేశారు. కొత్త కలెక్టర్​గా వస్తున్న దాసరి హరిచందన నగరంలోనే పుట్టి పెరిగారు. 2010 ఐఏఎస్‌‌‌‌ బ్యాచ్​కు చెందిన హరిచందన డిగ్రీ హైదరాబాద్​లోనే పూర్తి చేశారు. లండన్​లో పీజీ చేశారు. 

అక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సివిల్​సర్వీసెస్​పై ఆసక్తితో ఈ ప్రొఫెషన్​లోకి వచ్చారు. వైజాగ్​లో అసిస్టెంట్​కలెక్టర్​గా ఫస్ట్​పోస్టింగ్ పొందారు. తర్వాత విజయవాడ సబ్​కలెక్టర్​గా పని చేశారు. 2014 తర్వాత తెలంగాణకు వచ్చారు. నారాయణపేట, నల్గొండ జిల్లాలకు కలెక్టర్​గా పని చేశారు.  ఫుడ్ సేఫ్టీ కమిషనర్​గా, ఆయుష్  డిపార్ట్​మెంట్​డైరెక్టర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వంటి కీలక ఉద్యోగాల్లో పని చేశారు. ప్రస్తుతం రోడ్లు, భవనాల విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉండడంతో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​డైరెక్టర్ జనరల్‌‌‌‌గా పని చేస్తున్నారు. 

పని చేసిన ప్రతి చోటా తనదైన ముద్ర వేశారు. కలెక్టర్​గా పని చేసిన ప్రాంతాల్లో మహిళగా సాటి మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించారు. 25 మిలియన్​ మెట్రిక్​టన్నుల ప్లాస్టిక్​ను రీసైకిల్​చేసి టైల్స్​గా మార్చారు. హైదరాబాద్​లోని దుర్గం చెరువు బ్యూటిఫికేషన్​చేసి ఎకో టూరిజంగా మార్చేందుకు కష్టపడ్డారు. ఫీడ్​ ది నీడ్​కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ల నెట్​వర్క్​రూపొదించి ఫుడ్​వేస్ట్​ను ఆపి, పేదల ఆకలి తీరే ఆలోచనలు చేశారు. 

రూరల్​ట్రాన్స్​ఫర్మేషన్, డిజిటల్​లిటరసీ, హెల్త్​కేర్​డెవలప్​మెంట్​పై చొరవ తీసుకొని పని చేశారు. ఆమె చేసిన సోషల్​ఇంపాక్ట్​కు 2021లో బ్రిటిష్​ కౌన్సిల్​అవార్డు అందజేసింది. ఆ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్​హరిచందన కావడం విషేశం. ఇలా సిటీతో ఎంతో అనుబంధమున్న ఆఫీసర్​ హరిచందన హైదరాబాద్​కలెక్టర్​గా రాబోతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం  చేస్తున్నారు.  

చెరగని ముద్ర వేసిన అనుదీప్​

హైదరాబాద్ కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి  2023 జులై 14న హైదరాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌గా వచ్చారు. . స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్, ప్రభుత్వ భూముల రక్షణపై స్పెషల్​ ఫోకస్ పెట్టారు. కాఫీ విత్ కలెక్టర్ ప్రోగ్రామ్ ​పెట్టి స్కూల్స్​లో పాస్​పర్సంటేజీ పెంచడానికి ప్రయత్నించారు. ప్రజారోగ్యంపై కూడా దృష్టి పెట్టారు.  

మేడ్చల్ కలెక్టర్​గా మను చౌదరి 

మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పోట్రును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించింది. గౌతమ్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు డైరెక్టర్ గా పంపించింది. శుక్రవారం మను చౌదరి  బాధ్యతలు 
చేపట్టనున్నారు.