చాలామందికి రాత్రిపూట పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. అందుకోసం లైట్ ఆన్ చేసి ఉంచడంతో ఇంట్లోవాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు ఈ లైట్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రత్యేకంగా బుక్స్ చదివేందుకే తయారుచేశారు. మోనోట్రెంప్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఈ లైట్‌లో (కూల్, వార్మ్, డేలైట్) మూడు కలర్ మోడ్స్ ఉంటాయి.
వాటిలో ఒక్కోదాన్ని మూడు బ్రైట్‌నెస్ లెవల్స్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. గదిలో ఉన్న వెలుతురుని బట్టి లైట్ మోడ్‌ని మార్చుకుంటే సరిపోతుంది. పుస్తకాలకు అటాచ్ చేసేందుకు దీనికి క్లిప్ ఉంటుంది. సైజులో కూడా ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 70 గంటల వరకు పనిచేస్తుంది. యూఎస్‌బీతో చార్జింగ్ చేసుకోవచ్చు. దీని ధర ధర రూ. 849 . దీని నెక్ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
–వెలుగు, లైఫ్–
