జీఎస్టీ తగ్గింపులు, టెక్ పెట్టుబడులతో.. తయారీ రంగంలో జోరు

జీఎస్టీ తగ్గింపులు, టెక్ పెట్టుబడులతో.. తయారీ రంగంలో జోరు

న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపులు, టెక్​ పెట్టుబడులు, భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ కారణంగా అక్టోబర్​లో భారతదేశ తయారీ రంగ కార్యకలాపాలు మరింత పెరిగాయి. హెచ్ఎస్​బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్​ ఇండెక్స్ (పీఎంఐ) సెప్టెంబర్​లో 57.7 ఉండగా, అక్టోబర్​లో 59.2కి పెరిగింది.   ఈ రంగం వేగంగా ఎదుగుతోందని ఇది సూచిస్తుంది. 

పీఎంఐ 50 కంటే ఎక్కువ పాయింట్లు ఉంటే విస్తరణగా భావిస్తారు. కొత్త ఆర్డర్లు పెరగడానికి దేశీయ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. ఇన్​పుట్ ఖర్చులు తగ్గినప్పటికీ, తయారీదారులు పెరిగిన ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడంతో సగటు అమ్మకం ధరలు పెరిగాయి.  వరుసగా 20వ నెలలోనూ నియామకాలు కొనసాగాయని హెచ్​ఎస్​బీసీ తెలిపింది.