ఒకే హాస్టల్‌లో 229 మంది విద్యార్థులకు కరోనా

ఒకే హాస్టల్‌లో 229 మంది విద్యార్థులకు కరోనా

మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తోంది. అక్కడ కేసులు పెరుగుతండటంతో నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు మూసేశారు. తాజాగా వాషిమ్ జిల్లాలోని రిసోడ్ తాలూకాలోని డేగాన్‌కు చెందిన ఒక పాఠశాల హాస్టల్‌లో 327 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 229 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వీరితో పాటు నలుగురు ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటవ్‌గా తేలింది. దాంతో పాఠశాల ప్రాంగణాన్ని కంటయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వీరిలో చాలామంది విద్యార్థులు అమరావతి మరియు యావత్మల్ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో గత కొన్ని రోజులు నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 8,000 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా ఆంక్షలను పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం మరియు ముంబై పోలీసులు హెచ్చరించారు.

For More News..

ఆలూ-హార్ట్: మహిళను చంపి.. గుండెను ఆలుగడ్డలతో కలిపి వండిన ఉన్మాది

నాలుగు గంటలు పనిచేయని స్టాక్ ఎక్స్చేంజ్‌..

సిటీలో ఎక్కడి చెత్త అక్కడే.. కంప్లయింట్స్ చేస్తున్నా పట్టించుకోని అధికారులు