ఉద్యమంలో డబ్బులు పెట్టాను కానీ సంపాదించుకోలేదు

ఉద్యమంలో డబ్బులు పెట్టాను కానీ సంపాదించుకోలేదు

మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడని.. 12సార్లు రెడ్డి సామాజికవర్గం నుంచే ఎమ్మెల్యేగా కొనసాగారని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మునుగోడులో  బీసీలు 67 శాతం ఉన్నారని తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా రెండు లక్షల పైచిలుకు ఓట్లు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు సుమారు లక్షా 60వేలకు పైగా ఉన్నట్లు చెప్పారు. ఈ సారి బీసీ సామాజిక వర్గం నుంచి  ఎమ్మెల్యే టికెట్ ఆశించడంతో ఎలాంటి తప్పులేదన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎవరికి టికెట్ ఇచ్చిన కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక 24 గంటల కరెంట్ సహా మన వనరులు మనం వాడుకోవడం.. మన రెవిన్యూ మనం పెంచుకోవడం జరుగుతోందన్నారు. ఇది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమైందని చెప్పారు. కాగా 2009 నుండి తాను ఉద్యమంలో పాల్గొన్నానని.. ఉద్యమంలో డబ్బులు పెట్టాను కానీ సంపాదించుకోలేదని నర్సయ్య గౌడ్ తెలిపారు.