
సంగారెడ్డి టౌన్, వెలుగు: కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 24 నుంచి బూస్టర్ డోస్ (కార్బియక్స్ వ్యాక్సిన్) ఇవ్వనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జహీరాబాద్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సంగారెడ్డి మార్క్స్ నగర్‌లోని యుపీహెచ్‌పీ, పటాన్ చెరువు, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న వారు తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. కోవ్యాగ్జిన్, కోవి షీల్డ్ తీసుకున్న వారు కూడా బూస్టర్ డోస్‌గా కార్బియక్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడించారు.