
- డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‑1 ప్లే ఆఫ్స్‌కు ఇండియా క్వాలిఫై
- మొరాకోపై 4‑1తో విక్టరీ
లక్నో:
ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్‌ను విజయంతో ముగించాడు. ఆదివారం జరిగిన వరల్డ్ గ్రూప్–2లో ఇండియా 4–1తో మొరాకోపై గెలిచింది. దీంతో వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన డబుల్స్‌లో బోపన్న–యూకీ భాంబ్రీ 6–2, 6–1తో ఇలియట్ బెంచెట్రిట్–యూనెస్ లాలామి లారౌసీపై గెలిచాడు. బోపన్న కెరీర్‌లో ఇది 33వ ఫైనల్ కావడం విశేషం. 1 గంటా 11 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ జోడీ అంచనాలను అందుకుంది.
Also Rard: మద్యానికి బానిసై.. కుటుంబ గొడవలతో సూసైడ్
మ్యాచ్ మొత్తంలో బోపన్న జోడీ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాచుకుంది. బోపన్న బలమైన సర్వ్‌లతో ఆకట్టుకుంటే భాంబ్రీ టెక్నికల్ షాట్స్‌తో ప్రత్యర్థులను నిలువరించాడు. రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్నె దిలిమిపై నెగ్గాడు. డేవిస్ కప్ సింగిల్స్ మ్యాచ్‌లో సుమిత్ రెండు మ్యాచ్‌లు నెగ్గడం ఇదే తొలిసారి. 2019లో పాక్‌పై ఈ ఫీట్ సాధించాడు. మరో సింగిల్స్‌లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్ అహుడాను ఓడించాడు.
బోపన్న భావోద్వేగం..
2002లో డేవిస్ కప్‌లో అడుగుపెట్టిన బోపన్న కెరీర్ చివరి క్షణాల్లో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. మొత్తం 50 మ్యాచ్‌లు ఆడిన బోపన్న 33సార్లు ఫైనల్స్‌కు చేరాడు. ఇందులో 13 డబుల్స్ మ్యాచ్‌లతో కలిపి 23 సార్లు గెలిచాడు. 50 మంది వరకు ఫ్యామిలీ, స్నేహితులు, ఫ్యాన్స్ ఆద్యంతం బోపన్న మ్యాచ్‌ను తిలకించారు. త్రివర్ణాన్ని పట్టుకున్న బోపన్న ఫొటోతో కూడిన టీ షర్ట్స్ ధరించి సంఘీభావం ప్రకటించారు. ‘డేవిస్ కప్ నుంచి నేను తప్పుకోవడం వల్ల నా ప్లేస్‌లో మరొకరు వస్తారు. ఇందులో నేను ఇంతకంటే ఎక్కువ సాధించాల్సిందేమీ లేదు. అన్నింటికంటే ముఖ్యమైంది నాకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆమెతో కూడా విలువైన సమయాన్ని గడపాలి. ఇది అద్భుత ప్రయాణం. ఏదో ఓ రోజు ముగింపు తప్పదు’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.