బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. షెడ్యూల్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. షెడ్యూల్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ  2024-25 టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. 

ప్రతిష్టాత్మకంగా జరిగే బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి దీన్ని ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), బీసీసీఐ నిన్న(మార్చి 25) వెల్లడించాయి. 1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.

Also Read :గుజరాత్ మాస్టర్ ప్లాన్..చెన్నైకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహం

సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది. 

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.