- ఐటీ రిటర్నులను లోన్లకు వాడొచ్చు
- ఇందుకోసం ప్రత్యేకంగా అగ్రిగేటర్లు
- జియోకు అగ్రిగేటర్ లైసెన్సు
బెంగళూరు: బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం ఇక నుంచి మరింత ఈజీ కానుంది. ఇంతకాలం బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్న పేదవాళ్లు, చిరు వ్యాపారులు కూడా సులభంగా లోన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం బ్యాంకులు కస్టమర్ల డిజిటల్ డేటాను ఉపయోగించుకోనున్నాయి. పెద్ద తనఖాలు, గ్యారంటార్లు లేకుండా, ‘అగ్రిగేటింగ్’ పద్ధతిలో లోన్లు ఇవ్వడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచి అనుమతి కూడా వచ్చింది. మనదేశంలో 56 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉంటారు. వీరు నిత్యం ఒక టెరాబైట్ డేటా ఉత్పత్తి చేస్తారు. ఇక నుంచి యూజర్లకు తమ డిజిటల్ సమాచారాన్ని ఆర్‌బీఐ అందించనుంది. వాటిలో దేనిని వెల్లడించాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలనే అనే విషయాల్లో యూజర్‌దే తుది నిర్ణయమని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కస్టమర్ల డేటాకు తగిన భద్రత ఉంటుందని ఆర్‌బీఐ భరోసా ఇస్తోంది. డిజిటల్ డేటా ప్రకారం లోన్లు ఇస్తే కొత్తగా కోట్లాది మంది ఇండియన్లకు లోన్లు వచ్చే చాన్సులు ఉంటాయి. మనదేశం క్రెడిట్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. డేటా యాక్సెస్‌కు కస్టమర్లకు అనుమతి ఇవ్వడం ద్వారా పశ్చిమ దేశాల్లో అమలవుతున్న ఓపెన్ బ్యాంకింగ్ తరహా విధానాన్ని ఇండియాలోకి కూడా తేవాలని ఆర్‌బీఐ కోరుకుంటున్నది. డేటా షేరింగ్ బాధ్యతను, లోన్ల జారీకి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు అగ్రిగేటర్లను కూడా నియమించింది. బ్యాంకింగ్‌రంగం సేవలను ఉపయోగించుకోలేకపోతున్న పేదల సమాచారాన్ని ఇవి బ్యాంకులతో పంచుకొని అప్పులు ఇప్పిస్తాయి. ఫార్మల్ బ్యాంకింగ్‌కు దూరంగా ఉండే పేదలకు లోన్లు ఇవ్వడం అద్భుతమైన ఆలోచన అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ఓపెన్ బ్యాంకింగ్ కార్యక్రమం అమలుకు ఆయన సలహాదారుగానూ పనిచేస్తున్నారు.
సరికొత్త ప్రయోగం
ఈ కొత్త విధానం అమలైతే బ్యాంకులు లక్షలాది మంది చిన్న కంపెనీలకు లోన్లు ఇవ్వొచ్చు. వీటికి దాదాపు నెలకు రూ.1.5 లక్షల కోట్ల అప్పులు అవసరమని అంచనా. క్యాష్ ఫ్లో తప్ప ఏ ఇతర ఆస్తులు లేని చిన్న కంపెనీలకు ఈ కొత్త విధానంలో చిన్న బ్యాంకులు సాషే లోన్లు ఇవ్వొచ్చని బీజీ మహేశ్ అనే అకౌంట్ అగ్రిగేటర్ అన్నారు. అమెరికాలోనూ మూడు క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలు ఈ పద్ధతిలో లోన్లు ఇప్పిస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ కూడా మనదేశంలో జియో సహా ఆరుగురికి లైసెన్సులు జారీ చేసింది. వీటిలో కొన్ని కంపెనీలు ఇది వరకే ప్రయోగాలను కూడా ముగించాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు అగ్రిగేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని.. కొత్త విధానాన్ని పరీక్షిస్తున్నాయి. పేపర్‌వర్క్, డాక్యుమెంటేషన్ వంటి ఇబ్బందులు వల్ల చాలా మంది బ్యాంకు లోన్లకు దూరంగా ఉంటున్నారు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు లేకుండా అగ్రిగేటర్లు చూసుకుంటారని మహేశ్ చెప్పారు.
లోన్లు ఎలా ఇస్తారంటే…
ఇలాంటి సులభ పద్ధతుల్లో లోన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ రూల్స్‌ను, విధానాలను తీసుకొచ్చింది. చాలాకాలం నుంచి పేమెంట్స్ ఇన్ఫర్మేషన్, బయోమెట్రిక్ సమాచారాన్ని నిల్వ చేస్తోంది.
