కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన

పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సమావేశాలు తొలి రోజే ప్రజా సమస్యలపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. ద్రవ్యోల్బణం,గ్యాస్ ధరల పెరుగుదల,అగ్నిపథ్ పథకం,జీఎస్టీ పన్నుల పై చర్చ జరపాలని లోక్ సభలో విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అటు రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెరుగుదలపై రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. తర్వాత రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని....అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగానూ సభను ఛైర్మన్ వెంకయ్య నాయుడు రేపటివరకు వాయిదా వేశారు.ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రెండు సభల్లో ప్రెజెంటేషన్ కోసం వివిధ శాఖలు 32 బిల్లులను సూచించాయని.. వాటిలో 14 సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 అంతకు ముందు లోక్ సభ, రాజ్యసభల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేశారు. రాజ్యసభ ఎంపీలుగా విజయసాయిరెడ్డి, మస్తాన్ రావ్ బీద, విజయేంద్ర ప్రసాద్, కపిల్ సిబాల్, హర్బజన్ సింగ్ ప్రమాణం చేశారు. ఉభయసభల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి సంతాపం ప్రకటించారు. యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, శాస్త్రీయసంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ కు రాజ్యసభలో నివాళులర్పించారు.