బొకేల బిజినెస్ కు మస్తు గిరాకీ

బొకేల బిజినెస్ కు మస్తు గిరాకీ

హైదరాబాద్, వెలుగు: మ్యారేజ్ ఫంక్షన్లు, పబ్లిక్ మీటింగ్​లు, బర్త్ డే పార్టీలు, సన్మానాలు, ఇలా ఏ అకేషన్ జరిగినా విషెస్ తెలిపేందుకు బొకేలు తప్పనిసరి అయ్యాయి. ఎవరికైనా హార్ట్​ఫుల్​గా వెల్​కమ్ చెప్పేందుకు  బొకేలను సింబాలిక్​గా ఇస్తుంటారు. సిటీలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈవెంట్లు, మీటింగ్ లు, ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి. దీంతో బొకేలకు మంచి డిమాండ్ ఉంటోందని ఫ్లోరిస్టులు చెప్తున్నారు. ఇంట్లో ఫంక్షన్ల నుంచి  ఫైవ్ ​స్టార్​ హోటళ్లలో ఈవెంట్ల వరకూ బొకేలకు ప్రయార్టీ ఇస్తున్నారన్నారు. దీంతో  సిటీలో నెలకు సుమారు 100 కోట్ల విలువైన బిజినెస్ జరుగుతున్నట్లు అంచనా.  దీన్ని మరింత డెవలప్  చేసుకొనేందుకు దేశీపూలతో పాటు, విదేశాల నుంచి పూలను దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు బొకేలను మరింత ఆకర్షణీయంగా తయారు 
చేస్తున్నారు.  అకేషన్​కు తగినట్టుగా మార్కెట్లలోని స్టోర్లు, ఆన్ లైన్​లోనూ  బొకేలు అందుబాటులో ఉంటున్నాయి.    

ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తో ..

సిటీలో గుడిమల్కాపూర్‌‌‌‌‌‌‌‌, జాంబాగ్, ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌, మొజంజాహి ప్రాంతాల్లో  పూల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడికి  మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి రైతులు పూలను తీసుకొచ్చి అమ్ముతుంటారు. బొకేలు తయారు చేసే చిన్న వ్యాపారులు, సిటీలో పలు ప్రాంతాల్లో పూలమ్మేవారు ఈ మార్కెట్లకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. చిరు వ్యాపారుల నుంచి మొదలుకుని, బడా వ్యాపారుల వరకు సిటీలో దాదాపు 500 నుంచి 600ల వరకు ఫ్లోరిస్టులు ఉన్నారు. వీరి స్టోర్లలో సిటీ మార్కెట్లలో కొన్న  పూలతో పాటు కోల్‌‌‌‌‌‌‌‌కతా, పుణె, బెంగుళూరుల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాటితో బొకేలను తయారు చేస్తారు.  వీటితో పాటు నెదర్లాండ్స్, కెన్యా, కొలంబియా, న్యూజిలాండ్, థాయిలాండ్  దేశాల నుంచి పూలను దిగుమతి చేసుకుంటారు.   

కస్టమర్లకు నచ్చేలా..

పంజాగుట్ట పరిధి నాగార్జున సర్కిల్, సికింద్రాబాద్, మణికొండ ఇలా చాలా చోట్ల   ఫ్లోరిస్టు స్టోర్లు ఉన్నాయి. ఒక్కో స్టోర్​లో రోజుకు  50 నుంచి 70 బొకేలు అమ్ముడవుతుంటాయని ఓనర్లు  చెబుతున్నారు.  గులాబీలు, లిల్లీలు, తులిప్స్ తో చేసే సాధారణ బొకేలకు రూ.300 నుంచి రూ.500, కస్టమర్లు కోరుకున్న పూలతో చేసినప్పుడు  రూ. వెయ్యి నుంచి ధర ఉంటుందంటున్నారు. సన్మానాలు, బర్త్ డేలు, మ్యారేజెస్, వాలంటైన్స్ డే  లాంటి సందర్భాల్లో  కస్టమైజ్డ్ బొకేలకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని ఫ్లోరిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెప్తున్నారు. ఖరీదైన బొకేల్లో వెయ్యి గులాబీలతో చేసే రెడ్ రోస్ బాస్కెట్​కు రూ. 57వేలు  కాగా, విదేశీ పూలైన హైడ్రాన్ జెస్, ఆంథోరియం, లిల్లీస్, రోసెస్ కలిపి చేసే కలర్ ఫుల్ బొకే ధర 30 వేలు ఉంటుందంటున్నారు.

ఆన్ లైన్ ఆర్డర్లనూ తీసుకుంటున్నం 

 మా స్టోర్​లో రోజుకి 20 నుంచి 30 బొకేలు అమ్ముడవుతుంటాయి. ఆన్​లైన్​లోనూ ఆర్డర్లు వస్తుంటాయి. బొకేల తయారీకి కావాల్సిన పూలను గుడి మల్కాపూర్ మార్కెట్ నుంచి తీసుకొస్తాం. స్పెషల్ ఆర్డర్ల కోసం బెంగుళూరు, కర్ణాటకలోని డీలర్ల నుంచి నేరుగా స్టాక్ తెప్పిస్తాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, పూల ధరలు పెరిగాయి. దీంతో బొకేల మీద కూడా 15 నుంచి 20 శాతం రేట్లు పెంచాం. లాక్ డౌన్​లో బిజినెస్ డల్ అయినా ప్రస్తుతం పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లను ఉండటంతో మళ్లీ  గిరాకీ పెరిగింది.

బాస్కెట్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌‌‌‌‌తో..బాస్కెట్‌‌‌‌‌‌‌‌, రౌండ్ షేప్​లో ఫ్లవర్ బొకేలను తయారు చేస్తుంటాం.  365 రోజుల పాటు వాడిపోని అరుదైన రోస్ ఫ్లవర్స్​ను కూడా తెప్పించి బొకేలు చేస్తుంటాం. వాలెంటైన్స్ డే టైమ్​లో వందల్లో అమ్ముతాం.  ఇంపోర్టెడ్ పూలతో చేసే వాటి ధర రూ. 25 వేల నుంచి మొదలవుతుంది. 
 – లక్ష్మి, ఫియోరెల్లా ఫ్లోరిస్ట్ స్టోర్, బంజారాహిల్స్

నేరుగా డీలర్ల నుంచే..

పూల మార్కెట్‌‌‌‌‌‌‌‌లో థర్డ్ పార్టీ ఫ్లవర్స్ అందుబాటులో ఉంటాయి. బొకేలకు ఫ్రెష్ ఫ్లవర్స్ కావాలి. అందుకే బెంగళూరు, పుణే, కర్ణాటకకు చెందిన డీలర్లతో ఫ్లోరిస్టులు నేరుగా కాంటాక్ట్ అవుతారు.  ఆర్టీసీ బస్సుల ద్వారా స్టాక్ ట్రాన్స్ పోర్ట్ అవుతుంది. అలా నేరుగా స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కావాల్సినప్పుడు పూలను తెప్పించుకుంటారు. లోకల్ పూల మార్కెట్లలో లిల్లీలు, గులాబీలు, జిన్నియా వంటివి కొంటారు. మిగతావి నేరుగా ఇంపోర్ట్ చేసుకుంటారు. 
– దేవేందర్, సూపర్ వైజర్, గుడిమల్కాపూర్ పూల మార్కెట్