ఈ అమ్మాయి శాలరీ రెండున్నర లక్షలు.. ఖర్చుల కింద నెలకు ఎంత పోతున్నాయంటే..

ఈ అమ్మాయి శాలరీ రెండున్నర లక్షలు.. ఖర్చుల కింద నెలకు ఎంత పోతున్నాయంటే..

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై. ఇలాంటి ఒక మహా నగరంలో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే జీతం లక్షల్లో రావాల్సిందే. ఇంటి అద్దె మొదలుకుని ఏ ఖర్చు చూసుకున్నా తడిసిమోపెడవటం ఖాయం. అలాంటి ముంబై మహా నగరంలో జాబ్ చేస్తూ నెలకు రెండున్నర లక్షలకు పైగా సంపాదిస్తున్న ఒక యువతి తన జూన్ నెల ఖర్చుల వివరాలను ఇన్ స్టాగ్రాం వేదికగా చెప్పుకొచ్చింది. SoBo girl అనే పేరుతో ఉన్న ఈమె ఇన్ స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై ప్రస్తుతం నెట్టింట జోరుగా డిస్కషన్ జరుగుతోంది. సౌత్ ముంబైలో ఉంటున్న అన్హాద్ అనే ఈ యువతి మార్కెటింగ్ ప్రొఫెషనల్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anhadh (@an_had_fun_)

ఈమె జీతం ఈమె చెప్పిన వివరాల ప్రకారం.. నెలకు 2 లక్షల 67 వేల రూపాయలు. ఈ జీతం నుంచి SIP (Systematic Investment Plan) కింద లక్షా 80 వేలు పోతుంది. 2 లక్షల 67 వేల నుంచి లక్షా 80 వేలు పోగా మిగిలింది 87 వేలు. సొంత ఇల్లు ఉంది. సో.. రెంట్ గొడవ లేదు. పేరెంట్స్తో కలిసి ఉంటోంది కాబట్టి కిరాణా సరుకులు కూడా వాళ్లే చూసుకుంటారు. ఇక.. ఈ 87 వేలను ఎలా ఖర్చుపెట్టిందో ఆ అమ్మాయి చెప్పిన లిస్ట్ ఒక్కసారి చూద్దాం.

  • డైనింగ్ ఔట్ (హోటల్స్, రెస్టారెంట్స్కు వెళ్లి తిన్న తిండి ఖర్చు) (16 వేల 36 రూపాయలు)
  • ఫన్ (సినిమాలు, షికార్లు, డ్రింకింగ్.. ఎట్సెట్రా) (8 వేల 5వందల 10 రూపాయలు)
  • గ్రూమింగ్ (హెయిర్ స్టైలింగ్ ఇతరత్రా) (8 వేల 4 వందల 91 రూపాయలు)
  • స్విగ్గీ (ఫుడ్ ఆర్డర్స్) (3 వేల 4 వందల 9 రూపాయలు)
  • బుక్స్ (12 వందల 97 రూపాయలు)
  • టెన్నిస్ (6 వందల రూపాయలు)
  • ఉబర్ (6 వందల 48 రూపాయలు)

ఇవన్నీ లెక్కగడితే.. 38 వేల 991 రూపాయలు లెక్క తేలింది. 87 వేలలో నుంచి ఈ ఖర్చు తీసేయగా.. 47 వేల దాకా మిగిలింది. అయితే.. ఈ యువతి చెప్పిన లెక్కలపై కొందరు నెటిజన్లు నమ్మేలా లేదని డౌట్ పడ్డారు. మరికొందరు ఆమె తన శాలరీలో కేవలం 20 శాతం మాత్రమే ఖర్చు పెడుతుందని కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేశారు. ఇలా ఆమె శాలరీ, ఆమె చెప్పుకొచ్చిన ఖర్చుపై సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తోంది.