
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళవారం (జూలై 1) సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెచ్వీసీ అన్నమయ్య భవన్ సమీపంలోని పార్క్ వద్ద పిట్టగొడపై భక్తులకు చిరుత కనబడింది. సమీపంలో ఉన్న భక్తులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భక్తుల ద్వారా సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వార్నింగ్ సైరన్ మోగించారు.
ALSO READ | శివుడి భక్తులకు శుభవార్త : శ్రీశైలంలో సామాన్య భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం
దీంతో చిరుత అటవీప్రాంతంలో వెళ్ళింది. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అటవీ మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. చేతిలో కర్రలు వంటివి పట్టుకోవాలని చెప్పారు. నడక మార్గంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అధికారులను సమాచారం అందించాలని సూచించారు.