
వాషింగ్టన్: ఉగ్రవాద బాధితులను, నేరస్థులను ఎప్పుడు సమానంగా చూడొద్దని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరుగుతోన్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన యూఎస్ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందు జైశంకర్ మంగళవారం (జూలై 1) మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారతదేశానికి ఉందని, ఆ హక్కును వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. మా క్వాడ్ భాగస్వామ్య దేశాలు దానిని అర్థం చేసుకుని మమ్మల్ని అభినందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదం పట్ల ప్రపంచదేశాలు జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని కోరారు. ఉగ్రవాద బాధితులను, ఉగ్ర నేరస్థులను ఎప్పుడూ సమానంగా చూడకూడదని వ్యాఖ్యానించారు.
ALSO READ |సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి ట్రాన్స్ఫర్
ఇండో-పసిఫిక్ దేశాలకు అభివృద్ధి, భద్రతపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ఎంపిక స్వేచ్ఛ ఉండటం చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా క్వాడ్ దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయని.. వాటిలో సముద్ర డొమైన్, లాజిస్టిక్స్, విద్య, రాజకీయ సమన్వయం ప్రధానంగా ఉన్నాయన్నారు.