Gold Rate: గోల్డ్ లవర్స్‌కి దిమ్మదిరిగే షాక్.. నేడు భారీగా పెరిగిన పసిడి-వెండి, హైదరాబాదులో రేట్లివే..

Gold Rate: గోల్డ్ లవర్స్‌కి దిమ్మదిరిగే షాక్.. నేడు భారీగా పెరిగిన పసిడి-వెండి, హైదరాబాదులో రేట్లివే..

Gold Price Today: దాదాపు వారం రోజులుగా తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా నేడు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాల బ్రేక్ త్వరలోనే ముగియనుండటం, ఇప్పటికీ ఇండియా ట్రేడ్ డీల్ ఫైనల్ కాకపోవటం ఆందోళనలు పెంచుతోంది. దీనికి తోడు అమెరికాలో తెస్తున్న టాక్స్ బిల్లు వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలు పసిడి ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.10వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 020, ముంబైలో రూ.9వేల 020, దిల్లీలో రూ.9వేల 035, కలకత్తాలో రూ.9వేల 020, బెంగళూరులో రూ.9వేల 020, కేరళలో రూ.9వేల 020, పూణేలో రూ.9వేల 020, వడోదరలో రూ.9వేల 025, జైపూరులో రూ.9వేల 035, లక్నోలో రూ.9వేల 035, మంగళూరులో రూ.9వేల 020, నాశిక్ లో రూ.9వేల 023, అయోధ్యలో రూ.9వేల 035, బళ్లారిలో రూ.9వేల 020, గురుగ్రాములో రూ.9వేల 035, నోయిడాలో రూ.9వేల 035గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.11వేల 400 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 840, ముంబైలో రూ.9వేల 840, దిల్లీలో రూ.9వేల 855, కలకత్తాలో రూ.9వేల 840, బెంగళూరులో రూ.9వేల 840, కేరళలో రూ.9వేల 840, పూణేలో రూ.9వేల 840, వడోదరలో రూ.9వేల 845, జైపూరులో రూ.9వేల 855, లక్నోలో రూ.9వేల 855, మంగళూరులో రూ.9వేల 840, నాశిక్ లో రూ.9వేల 843, అయోధ్యలో రూ.9వేల 855, బళ్లారిలో రూ.9వేల 840, గురుగ్రాములో రూ.9వేల 855, నోయిడాలో రూ.9వేల 855గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 400గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రూ.2వేల 300 పెరిగి ధర రూ.లక్ష 20వేలకు చేరుకుంది.