సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నూతన్ కాలనీలో భర్త భార్యనుహత్య చేశాడు. ఇరువురి మధ్య తలెత్తిన గొడవ కారణంగా క్షణికావేశంలో భార్య ఝాన్సీలక్ష్మిపై భర్త సత్యనారాయణ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గొడవ జరుగుతున్న తరుణంలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు సత్యనారాయణ స్వస్థలం అమలాపురం. ఇతనిపై గతంలో కూడా హత్యా నేరం కింద పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న సత్యనారాయణ బంధువుల ఇంటికి వచ్చి తన భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటలాస్థలికి చేరుకున్న బోయిన్ పల్లి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన అనంతరం సత్యనారాయణ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.
