మూడు కిలోల బర్గర్​ తిన్నాడు

మూడు కిలోల బర్గర్​ తిన్నాడు

ఎంత ఇష్టమున్నా ఒకటి రెండుకి మించి తినలేం బర్గర్స్. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న అమెరికా అబ్బాయి  మ్యాట్​ స్టోనీ మాత్రం 20,000 క్యాలరీలున్న బర్గర్​ తిన్నాడు. అది కూడా నాలుగు నిమిషాల పది సెకన్లలో 3 కిలోల బరువున్న బర్గర్​ను తింటున్న ఆ వీడియోని రీసెంట్​గా ఓ యూట్యూబ్​ ఛానెల్​లో పోస్ట్​  చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి ఆ వీడియోకి. అయితే ఇలా అందరూ ఆశ్చర్యపోయేలా తినడం మ్యాట్​కి కొత్తేం కాదు. ఎందుకంటే మ్యాట్​ అమెరికాలో పాపులర్​ ఫుడ్​ కాంపిటీటర్స్​లో ఒకడు.

ఇంతకుముందు కూడా ఫుడ్​ కాంపిటీషన్స్​లో ఎన్నో రికార్డ్స్​ బద్దలుకొట్టాడు ఇతను. ఇప్పుడు తాజాగా లాస్​ వెగాస్​లోని ‘హార్ట్​ ఎటాక్​ గ్రిల్​ హమ్​ బర్గ్​ రెస్టారెంట్’​ ఏర్పాటు చేసిన ‘ఆక్టోపల్​ బైపాస్’​ ఛాలెంజ్​లో పార్టిసిపేట్​ చేశాడు. ఈ ఛాలెంజ్​ గెలవడం అంత ఆషామాషీ కాదు.  పొరలు పొరలుగా ఉండే ఈ బర్గర్​లో 20, 000 కేలరీలు ఉంటాయి. 40 బేకన్​ స్ట్రిప్స్​, 16 స్లైస్​లు వాటి మధ్యలో ఉల్లిగడ్డలు, టొమాటోలు, మిర్చి, బన్స్​తో ఉండే ఈ బర్గర్​ దాదాపు మూడు కిలోల బరువు ఉంటుంది. దాంతో చాలామంది ఫుడ్డీస్​ ఈ బర్గర్ తినలేమంటూ చేతులెత్తేశారు. కానీ, మ్యాట్​ స్టోనీ మాత్రం కేవలం 4.10 నిమిషాల్లో ఈ బర్గర్​ తిని రికార్డ్​ సృష్టించాడు. దాంతో సోషల్​ మీడియాలో ఇతని పేరు మార్మోగుతోంది.