
వీధి కుక్కల దాడులు కలవర పెడుతున్నాయి. రోజుకో చోట మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పరిధిలో ఐదు వీధి కుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాతబస్తీ రక్షాపురానికి చెందిన బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి డీఆర్డీవో టౌన్ షిప్ లో ఓ వేడుకకు హాజరయ్యాడు. పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఐదు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి.