విష పురుగు కుట్టి బాలుడు మృతి ...మెదక్ జిల్లా యూసుఫ్ ఖాన్ పల్లిలో ఘటన

విష పురుగు కుట్టి బాలుడు మృతి ...మెదక్ జిల్లా యూసుఫ్ ఖాన్ పల్లిలో ఘటన

ములుగు, వెలుగు:  విష పురుగు కుట్టడడంతో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ ​జిల్లాలో జరిగింది. ఎస్ఐ దామోదర్ తెలిపిన ప్రకారం.. మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన బసదపు సంధ్య, కుమార్ దంపతుల కొడుకు చాణక్య(18 నెలలు) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు రోడ్డుపైన ఆడుకుంటుండగా గుర్తుతెలియని విష పురుగు కుట్టింది. బాబు ఆడుకుంటూనే కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. అనుమానించిన తల్లి ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లింది. చాణక్యను పరీక్షించిన డాక్టర్ అంతకుముందే చనిపోయాడని తెలిపారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.