వైరల్ వీడియో: లాక్ డౌన్ తర్వాత బరాత్‌‌‌‌తో.. బడికి పొయిండు

V6 Velugu Posted on Nov 21, 2021

కరోనా వచ్చుడుతోనే లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లు పడ్డయ్‌‌‌‌. అప్పటి సంది దాదాపు రెండేండ్లు పిల్లగాండ్లకు బళ్లు లేవు. ఇంట్లనే ఉంటు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు విన్నరు. అప్పుడు చూడాలి ఒక్కో ఇల్లు. ‘బళ్లు ఎప్పుడు తెరుస్తరా? పిల్లగాండ్లను ఎప్పుడు బడికి పంపుదమా?” అని ఎదురు చూసిన్రు తల్లిదండ్రులు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు మరి. అందుకే స్కూళ్లు షురూ అయిన వెంటనే మస్త్‌‌‌‌ సంబురంగ పిల్లల్ని బళ్లకు పంపిన్రు చాలామంది. అట్లనే ఢిల్లీల ఒక పిల్లగాడ్ని బరాత్‌‌‌‌ చేసుకుంట స్కూల్‌‌‌‌కి తీస్కపోయిన్రు వాళ్ల ఇంట్లో వాళ్లు. ఢిల్లీలోని స్ప్రింగ్‌‌‌‌ డీల్స్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బయట బరాత్‌‌‌‌తో పిల్లగాడు డాన్స్‌‌‌‌ చేస్తున్న వీడియో సఫిర్‌‌‌‌‌‌‌‌ అనే ఆయన సోషల్‌‌‌‌ మీడియాలో పెట్టిండు. దాంతో అది వైరల్‌‌‌‌ అయింది. ఇంట్ల ఉన్న ఆ పిల్లగాడు వాళ్లను ఎంత సతాయిచ్చిండో ఏమో.. ఇప్పుడు ఇట్ల సెలబ్రేట్‌‌‌‌ చేసుకుంటున్నరు వాళ్లంత అంటున్నరు చూసినోళ్లంత. 

 

Tagged Delhi, lockdown, band baja barat, springdales school

Latest Videos

Subscribe Now

More News