వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

శంషాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి పోచమ్మగడ్డ 8వ కాలనీలో బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

8వ వార్డులో వీధి కుక్కలు పెరిగిపోయాయని.. వాటిని తరలించకపోతే మున్సిపల్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరించారు.