విషాదం.. తాత కారుకింద పడి రెండేళ్ల మనవడు మృతి

విషాదం.. తాత కారుకింద పడి రెండేళ్ల మనవడు మృతి

ప్రమాదవశాత్తు తాత కారు కిందపడి మనవడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట్లో విషాదం నింపింది. కేరళలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్లు బాలుడు శరీరం కారు టైరు కిందపడి నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. 

తాత కారు ఇంట్లోకి ప్రవేశించగానే త్వరగా అతడిని చేరుకునేందుకు ఇద్దరు మనవళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు.. పెద్ద మనవడు దూరంగా నిలబడగా.. చిన్న మనవడు కారుకు అడ్డంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందుకు ఉన్న చిన్నారి కనిపించకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీఫుటేజీలో తెలుస్తోంది. ఏడుపు విని కారు కిందికి చూడగా రక్తపు మడుగులో చిన్నారు పడివుండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండేళ్లు బాలుడు మృతి చెందాడు.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ALSO READ : మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు