పిచ్చి పీక్స్: ఫోన్ లో గేమ్ ఆడుతూ టాయిలెట్ సీట్ లో ఇరుక్కున్నాడు

పిచ్చి పీక్స్: ఫోన్ లో గేమ్ ఆడుతూ టాయిలెట్ సీట్ లో ఇరుక్కున్నాడు

చాలామందికి టాయిలెట్‌​లో కూడా ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. ఆ అలవాటే ఒక బుడతడి కొంప ముంచింది. ఇప్పడు పిల్లలు పుస్తకాలతో కన్నా సెల్ ఫోన్ లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంట్లో ఉన్నంత సేపు వీడియో గేమ్స్ ఆడడమో, యూట్యూబ్ లో వీడియోలు చూడడమో చేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్లే సెంట్రల్ చైనాలోని వుహాన్ లో ఒక ఆరేళ్ల పిల్లాడు టాయిలెట్ రూంలోకి మొబైల్ తీసుకెళ్లాడు. ఫోన్ మాయలో పడి టాయిలెట్ సీట్ లో ఇరుక్కున్నాడు. పిల్లాడు గేమ్స్ ఆడుతూ గంటల కొద్దీ టాయిలెట్ సీటుపైనే కూర్చున్నాడు. తర్వాత లేచేందుకు ప్రయత్నించాడు. బుడతడికి అప్పుడు అర్థమైంది తన శరీరం నడుం వరకు టాయిలెట్ సీటులో ఇరుక్కుపోయిందని. ఎంతా ప్రయత్నించినా బయటకు రాలేకపోవడంతో గట్టిగా కేకలు వేశాడు. దాంతో తల్లిదండ్రులు టాయిలెట్ రూంలోకి పరిగెత్తుకెళ్లారు. తీరా చూస్తే ఇరుక్కుపోయి ఉన్నాడు. బయటకు తీసేందుకు చాలా కష్టపడ్డారు. కానీ, వాళ్ల వల్ల కాలేదు. దాంతో ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన ఫైర్ పైటర్లు సుమారు గంటసేపు కష్టపడి టాయిలెట్ సీటు కట్ చేసి పిల్లాడిని బయటకు తీశారు. అక్కడే ఉన్నవాళ్లు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. అది వైరల్ అయ్యింది.