అఖండ 2' కోసం బోయపాటి శ్రీను భారీ రెమ్యునరేషన్.. సినీ పరిశ్రమలో హాట్ టాపిక్!

అఖండ 2' కోసం బోయపాటి శ్రీను భారీ రెమ్యునరేషన్..  సినీ పరిశ్రమలో హాట్ టాపిక్!

బోయపాటి శ్రీను (Boyapati Srinu) - ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాస్, యాక్షన్, పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ గురించి సినీ వర్గాల్లో ఓ వార్త గుప్పుమంది. తన తదుపరి యాక్షన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2) కోసం భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు  సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  ఆయన ఏకంగా ₹40 కోట్ల మేరకు తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం నిజమైతే, బోయపాటి ఇప్పుడు తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు.

బాలకృష్ణతో బోయపాటి విజయ పరంపర:
నటసింహం నందమూరి బాలకృష్ణ, (Nandamuri Balakrishna)  దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తెలుగునాట తిరుగులేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన 'సింహా' (Simha), 'లెజెండ్' (Legend) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి.  ఆ తర్వాత వచ్చిన 'అఖండ' (Akhanda) అయితే అంచనాలను మించిపోయి, ఒక కమర్షియల్ జగ్గర్‌నాట్‌గా నిలిచింది. కేవలం షేర్ రూపంలోనే 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, అఖండమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయాల పరంపరే బోయపాటి తన బ్రాండ్ వాల్యూని, నిరూపితమైన ట్రాక్ రికార్డుని క్యాష్ చేసుకోవడానికి ఈ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడానికి కారణమని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. "అఖండ విజయంతో, దాని సీక్వెల్ 'అఖండ 2: తాండవం'కి బోయపాటి తన బ్రాండ్ విలువను,  ట్రాక్ రికార్డును సొమ్ము చేసుకుంటున్నారు" అని సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

'అఖండ 2' - భారీ బడ్జెట్‌, భారీ అంచనాలు:
''అఖండ 2: తాండవం'' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ ₹160 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.   ఇందులో దర్శకుడి భారీ పారితోషికం కూడా చేరి ఉంది. బోయపాటి కేవలం దర్శకుడిగానే కాకుండా, ఈ సినిమా ప్రతీ అంశంలోనూ లోతుగా పాలుపంచుకుంటున్నారని తెలుస్తోంది. "స్క్రిప్టింగ్, డైలాగ్‌ల నుంచి లొకేషన్ల ఎంపిక వరకు ప్రతి సృజనాత్మక, నిర్మాణ పరమైన అంశంలో బోయపాటి నిమగ్నమై ఉన్నారు.  సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకురావడానికి గట్టిగానే కృషి చేస్తున్నారు..

టాప్ డైరెక్టర్లతో సమానంగా బోయపాటి:
ఈ డీల్‌ నిజమైతే, బోయపాటి ఇప్పుడు కొరటాల శివ (Koratala Siva), సుకుమార్ (Sukumar) వంటి అగ్రశ్రేణి తెలుగు దర్శకులతో పారితోషికం విషయంలో సమానంగా నిలుస్తున్నారు. ఇది ఆయన మార్కెట్ విలువను, చిత్ర పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని మరింత పెంచుతుంది. ''అఖండ 2: తాండవం'' కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, అంతకు మించి అంచనాలను పెంచుతోంది. మొదటి భాగంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, అందులో అఘోరా పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పగ, ప్రతీకారం, ధర్మాన్ని నిలబెట్టే కథాంశంతో పాటు, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రాణం పోశాయి.

'అఖండ 2' కథాంశంపై ఊహాగానాలు:
''అఖండ 2: తాండవం' కోసం బోయపాటి ఎలాంటి కథాంశాన్ని సిద్ధం చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి భాగంలో అఘోరా పాత్రకు ఉన్న బ్యాక్‌స్టోరీ, అతని ఆధ్యాత్మిక ప్రయాణం, అతను తిరిగి అఘోరాగా మారడానికి దారితీసిన పరిస్థితులపై రెండో భాగంలో మరింత లోతుగా చూపిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. బాలకృష్ణకు తగ్గట్టుగా, ఆయన అభిమానులు కోరుకునే విధంగా పవర్‌ఫుల్ డైలాగ్‌లు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ''అఖండ 2: తాండవం''లో పుష్కలంగా ఉంటాయని భావిస్తున్నారు.  ఈ సినిమా కూడా బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీని బాలకృష్ట కుమార్తె తేజస్విని సమర్పిస్తుండగా.. రామ్ అచంట, గోపి అంచట నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా  ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.