
ఎప్పుడు ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేరు. బీచ్ లో ఎంజాయి చేద్దామనుకున్న ప్రేమికులకు విధి వక్రీకరించింది. అనుకోని సంఘటనతో ప్రియుడు మృతి చెందాడు. ఓ ప్రేమ జంట సరదాగా బీచ్ కు వెళ్లింది. ప్రియుడి ఫొటోలను ప్రియురాలు చిత్రీకరిస్తుండగా.. సడన్ గా అతనిపై పిడుగుపడి మరణించాడు. ఈ ఘటన గ్రీస్ లో చోటు చేసుకుంది.
స్కాడ్ సెడాన్ అనే వ్యక్తి బ్రిటన్ లో నివసిస్తాడు. అయితే సెలవుల్లో ఎంజాయి చేసేందుకు తన ప్రియురాలితో కలిసి గ్రీస్ వెళ్లాడు. ఇందులో భాగంగా మే 29న గ్రీస్ లో బీచ్ లో బోటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో సెడాన్ ను అతని ప్రియురాలి ఫొటోలు తీస్తుండగా భారీ శబ్బంంతో సెడాప్ పై పిడుగు పడింది. దీంతో అతను మృతి చెందాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్న సమయంలో..స్కాడ్ సెడాన్ ను సముద్రంలో నుంచి బయటకు రావాలని అతని ప్రియురాలు కోరింది. అయినా అతడు వినిపించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కోలుకునే అవకాశం కూడా రాలేదు
స్కాడ్ సెడాన్ పై పిడుగు పడటంతో అతని ముఖం నీలం రంగులోకి మారిందని ప్రియురాలు రోడియా తెలిపింది. ఎలాగోలా ఒడ్డుకు చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. స్కాట్ చాలా ప్రజాదరణ, ఉల్లాసమైన వ్యక్తి అని అతని మరణంతో ఆ కుటుంబానికి షాక్ లాంటిదని స్థానికులు తెలిపారు.