సంపత్రావుకు ప్రముఖుల నివాళి

సంపత్రావుకు ప్రముఖుల నివాళి

పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన బోయినపల్లి సంపత్​రావు ఇటీవల మృతిచెందగా, ఆదివారం దశదినకర్మను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ హాజరై సంపత్​రావు ఫొటోకు నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.​ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మేడిశెట్టి రాములు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.