3 కంపెనీలతో బీపీసీఎల్ జోడీ

3 కంపెనీలతో బీపీసీఎల్ జోడీ
  • ఓఐఎల్, ఎన్​ఆర్‌‌‌‌ఎల్, ఫ్యాక్ట్​తో ఒప్పందాలు
  • ఏపీలో పెట్రో కెమికల్​ కాంప్లెక్స్​

హైదరాబాద్​, వెలుగు: భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్(బీపీసీఎల్) ఆయిల్ ఇండియా లిమిటెడ్​ (ఓఐఎల్), నుమాలిగఢ్​ రిఫైనరీ లిమిటెడ్​ (ఎన్​ఆర్‌‌‌‌ఎల్​)  ఫర్టిలైజర్స్ అండ్​ కెమికల్స్​ ట్రావెన్‌‌‌‌కోర్​ లిమిటెడ్​ (ఫ్యాక్ట్​)తో మంగళవారం హైదరాబాద్​లో మూడు అవగాహన ఒప్పందాలపై (ఎంఓయూలు) సంతకాలు చేసింది.  బీపీసీఎల్​, ఓఐఎల్​లు ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు సమీపంలో రాబోయే గ్రీన్‌‌‌‌ఫీల్డ్​ రిఫైనరీ,  పెట్రోకెమికల్​ కాంప్లెక్స్​ అభివృద్ధిలో సహకారం కోసం ఒక నాన్-–బైండింగ్​ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 

ఎన్​ఆర్‌‌‌‌ఎల్​ తన సామర్థ్యాన్ని 3 ఎంఎంటీపీఏ (మిలియన్​ మెట్రిక్​ టన్స్​ పర్​ ఆనమ్​) నుంచి 9 ఎంఎంటీపీఏ కు విస్తరించిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తులను తరలించడానికి బీపీసీఎల్​, ఓఐఎల్​,  నుమాలిగఢ్​ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్​ఆర్‌‌‌‌ఎల్​) ఒప్పందం చేసుకున్నాయి. సిలిగురి నుంచి ముజఫర్‌‌‌‌పూర్​ మీదుగా మొఘల్‌‌‌‌ సరాయ్​ వరకు 700- కిలోమీటర్ల క్రాస్- కంట్రీ ప్రొడక్ట్​ పైప్‌‌‌‌లైన్​ను కలిసి నిర్మిస్తారు.  

దీని అంచనా పెట్టుబడి రూ. 3,500 కోట్లు.  బీపీసీఎల్​ తన గ్రీన్​ ఎనర్జీ  వేస్ట్- టు- ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు, ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ ట్రావెన్‌‌‌‌కోర్​ లిమిటెడ్​ (ఫ్యాక్ట్​)తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. కొచ్చి రిఫైనరీ సమీపంలోని బ్రహ్మపురంలో రాబోయే మున్సిపల్​ సాలిడ్​ వేస్ట్​ (ఎంఎస్‌‌‌‌డబ్ల్యూ) ఆధారిత కంప్రెస్డ్​ బయోగ్యాస్​ (సీబీజీ) ప్లాంట్​ నుంచి ఫెర్మెంటెడ్​ ఆర్గానిక్​ ఎరువు,  లిక్విడ్​ ఫెర్మెంటెడ్​ ఆర్గానిక్​ ఎరువు సరఫరా,  ట్రేడింగ్​ కోసం ఈ ఒప్పందం కుదిరింది.