ఇండియన్ అమెరికన్లు రాజకీయాల్లో భాగమవ్వాలి: నిక్కీ హేలీ

ఇండియన్ అమెరికన్లు రాజకీయాల్లో భాగమవ్వాలి: నిక్కీ హేలీ

వాషింగ్టన్: మీ విజయాల గురించి గొప్పగా చెప్పుకోండి అంటూ ఇండియన్ అమెరికన్స్ కు నిక్కీ హేలీ సూచించారు. మైనారిటీలు తమ విజయ గాథలను ధైర్యంగా చెప్పుకోవాలని, దీనికి సిగ్గు పడొద్దన్నారు. ఓట్ల ద్వారానే ఎన్నికల్లో భాగం కాకూడదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టార్స్ లో సేవలు అందించడం ద్వారా ఇందులో భాగమవ్వాలని హేలీ చెప్పారు. ‘భారతీయులు తాము ముట్టుకున్న ప్రతి దాంతో చాలా బాగా మెదులుతారు. రాజకీయాల్లో వారు భాగమవ్వడం కూడా సహజంగా జరగాలి’ అని యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్ లో హేలీ పిలుపునిచ్చారు. యునైటెడ్ నేషన్స్ లో యూఎస్ అంబాసిడర్ గా ఆమె సేవలు అందించిన హేలీ.. రెండుసార్లు స్టేట్ గవర్నర్ గానూ బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.