మే 10న వస్తున్న బ్రహ్మచారి

మే 10న వస్తున్న బ్రహ్మచారి

రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రహ్మచారి’. షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్,  నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, డైరెక్టర్ చంద్ర మహేశ్ పాల్గొని సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

హీరో మల్లేశం మాట్లాడుతూ ‘నేను ఒగ్గుకథ కళాకారుణ్ణి. ఇలాంటి మంచి కామెడీ సినిమాలో ఛాన్స్​ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రం చాలా నేచురల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని, ప్రేక్షకులు హిట్ చేస్తారని నమ్మకం ఉందని దర్శకుడు నర్సింగ్, నిర్మాత రాంభూపాల్ రెడ్డి చెప్పారు.