ప్రతి జిల్లాలో బ్రాహ్మణ బిల్డింగులు ఏర్పాటు చేయాలని బ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ గర్జన సభలో ఈ డిమాండ్ చేశారు. చట్ట సభాల్లో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం పెరగాలని కోరారు. ప్రతి జిల్లాలో బ్రాహ్మణులకు సెపరేట్ గా ఇళ్లు ఇవ్వాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే N.V.S. S ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే,సుదీర్ బాబు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, కల్వకుంట్ల కవిత అనేక మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
అనేక రకాలుగా అనేక మంది బ్రాహ్మణులపై దుష్ప్రచారం చేస్తున్నారు. చట్ట సభల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. బ్రాహ్మణుల్లో ఐకమత్యం ఉండాలి. : రాంచందర్ రావు,మాజీ ఎమ్మెల్సీ
దేశాన్ని ఐక్యతగా ఉంచే దమ్ము ఉన్న వారు బ్రాహ్మణులు..దేశంలో అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం కడుతున్నది. రాబోయే రోజుల్లో చట్ట సబల్లో బ్రాహ్మణుల ప్రాతినిధ్యం పెరగాలి. ఎవరు ఏం పని చేయాలన్నా..బ్రహ్మణులు అవసరం. : మాజీ ఎమ్మెల్యే N.V.S.S ప్రభాకర్..
నిరంతరం ప్రజా మంచి,లోక కల్యాణం కోసం ఆలోచించే వారు బ్రాహ్మణులు. భేధాభిప్రాయాలు పక్కన పెట్టి..బ్రహ్మణులు ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ కేవలం రూ. 150 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. : శ్రీధర్ బాబు,మంథని ఎమ్మెల్యే
ఆధ్యాత్మికంలో సీఎం కేసీఆర్ ను మించిన వారు ఈ రాష్ట్రంలో,ఈ దేశంలో ఎవరూ లేరు..దేశంలో ఎక్కడ లేని విధంగా అద్బుతంగా బ్రాహ్మణుల కోసం ప్రత్యేక స్మశానవాటిక నిర్మించాం. : సుధీర్ రెడ్డి,ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే
