
- రాజస్థాన్లోని బికనీర్ వద్దబూస్టర్ శకలాలు లభ్యం
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ ‘సిందూర్’ లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను ప్రయోగించినట్లు సమాచారం. మిసైల్ కు సంబంధించిన బూస్టర్ శకలాలు రాజస్థాన్ లోని బికనీర్ వద్ద లభించాయి. భారత్, పాక్ సరిహద్దుల వద్ద బూస్టర్, నోస్ క్యాప్ ను పలువురు గుర్తించారు. బూస్టర్ శకలాలు, నోస్ క్యాప్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే జరిపిన ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత బూస్టర్ వేరుపడి సరిహద్దుల్లోని ఓ ప్రాంతంలో పడినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ మిసైల్ ను కచ్చితంగా ప్రయోగించి ఉంటారన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ తో పాట పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పలు టెర్రరిస్టు క్యాంపులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. కాగా.. బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.