మెడికవర్ హాస్పిటల్​లో  బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ఓపెన్

మెడికవర్ హాస్పిటల్​లో  బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ ఓపెన్

మాదాపూర్​, వెలుగు: రోజురోజుకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని.. ఆ వ్యాధిపై అవగాహన పెంచుకుని వెంటనే ట్రీట్​మెంట్ తీసుకుంటే దాని తీవ్రతను తగ్గించవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి తెలిపారు. వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా శనివారం మాదాపూర్​లోని మెడికవర్ హాస్పిటల్​లో బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్​ను ప్రారంభించి అనంతరం అవగాహన పోస్టర్​ రిలీజ్ చేశారు.

 న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోటి 70 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారన్నారు. ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు లైఫ్ టైమ్ స్ట్రోక్ కు గురవుతున్నారన్నారు.  దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. బ్రెయిన్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌కు గురైన వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి క్షణం విలువైనదేనన్నారు. న్యూరో స్ట్రోక్ సెంటర్లు కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయన్నారు. మెడికవర్​లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్​లో అన్ని సదుపాయాలు, సరైన టైమ్​లో ట్రీట్ మెంట్,  24  గంటల పాటు డాక్టర్లు ఉంటారన్నారు.  కార్యక్రమంలో డాక్టర్లు సతీష్​కుమార్​, మాత ప్రసాద్​, విక్రమ్ కిషోర్​, సిబ్బంది పాల్గొన్నారు.