బ్రెజిల్ వెళ్ళడానికి ఇండియన్స్ కు వీసా అవసరం లేదు

బ్రెజిల్ వెళ్ళడానికి ఇండియన్స్ కు వీసా అవసరం లేదు

విదేశాలకు వెళ్లాలంటే వీసా అవసరం. అయితే బ్రెజిల్ మాత్రం అవసరం లేదంటోంది. ఇందులో భారతీయులకు కూడా అవకాశం కల్పించింది. చైనా పర్యటనలో ఉన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో.. ఇండియన్లకు ఓ ఆఫర్ ఇచ్చారు. వీసా లేకుండానే తమ దేశానికి రావచ్చని తెలిపారు. ఇప్పటికే  అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియాకు కూడా బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా, భారత్ తో పాటు చైనాను కూడా ఆయన ఈ లిస్టులో చేర్చారు. ఈ దేశాలు మాత్రం బ్రెజిల్‌ పౌరులకు వీసా లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించలేదు.

ఆయా దేశాల పర్యాటకులు, బిజినెస్ మెన్లు వీసా లేకుండానే బ్రిజిల్ వెళ్లవచ్చు. జేర్‌ బోల్సొనారో గతేడాది బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో చాలా సార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల అమెజాన్‌ అడవిలో కార్చిచ్చుపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న NGOల కారణంగానే ఈ మంటలు చెలరేగాయన్నారు.