విమాన ప్రమాదంలో బ్రెజిల్ పాప్ క్వీన్ మృతి

విమాన ప్రమాదంలో బ్రెజిల్ పాప్ క్వీన్ మృతి

ప్రముఖ్ బ్రెజిల్ పాప్ క్వీన్  మరీలియా మెండోంకా విమాన ప్రమాదంలో చనిపోయారు.లాటిన్ గ్రామీ అవార్డు కూడా అందుకున్న మెండోంకో బ్రెజిల్ యువతకు ఆరాధ్య గాయని. 26 ఏళ్ల మెండోంకా తన అంకుల్, ఆల్బమ్ నిర్మాతతో కలిసి ప్రయాణిస్తుండగా, మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో విమానం కూలిపోయింది. ఓ కార్యక్రమంలో  పాల్గొనేందుకు ఆమె వెళుతున్నారు. ఈ ప్రమాదంలో వీరు ముగ్గురితో పాటు ఇద్దరు విమాన సిబ్బంది కూడా మరణించారు.

మెండోంకా పాటల్లో ప్రధానంగా ప్రేమలో విఫలమైన మహిళలు, జీవితంలో దెబ్బతిన్న మహిళల గురించే ఎక్కువగా ఉండేవి. టీనేజిలోనే గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మరీలియా మెండోంకా 2016 నాటికి బ్రెజిల్ లో అగ్రశ్రేణి పాప్ స్టార్ గా ఎదిగారు. 2019లో ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు (లాటిన్ గాయని కేటగిరీ) కూడా అందుకున్నారు. మెండోంకాకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.