
న్యూఢిల్లీ: బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో తనకు కరోనా నెగిటివ్‌గా తేలిందన్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ సోకడంతో కొన్ని వారాలుగా ఆయన తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో హైడ్రోక్లోరోక్విన్‌తోపాటు యాంటీ మలేరియల్ డ్రగ్‌తో జైర్ కనిపించారు. కరోనా నుంచి తాను కోలుకున్నానని.. ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్, సార్స్ కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్నారు. అయితే ఈ టెస్టులు ఎప్పుడు చేయించుకున్నదీ స్పష్టం చేయలేదు. ఒక్క నెలలో బొల్సొనారో మూడుమార్లు పాజిటివ్‌గా వచ్చింది. ఈ నెల 7న నిర్వహించిన పరీక్షల్లో జైర్‌కు వైరస్ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆయన ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్‌లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారిక కార్యక్రమాలను పర్యవేక్షించారు.