యాదాద్రిలో 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం

యాదాద్రిలో 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31 నుండి వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాల సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీ భక్తులకు అలాగే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఈవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉంటాయని వివరించారు. బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం, ఇతర టికెట్ దర్శనాలు నిలిపివేస్తామన్నారు. బ్రేక్ దర్శనాల సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని  ఈవో ఎన్.గీత చెప్పారు.