లాక్ డౌన్​ రూల్స్​ బ్రేక్.. పెండ్లికొడుకు తండ్రిపై కేసు

లాక్ డౌన్​ రూల్స్​ బ్రేక్.. పెండ్లికొడుకు తండ్రిపై కేసు

బెల్లంపల్లి, వెలుగు: పెండ్లిలో కరోనా రూల్స్​బ్రేక్​చేసినందుకు పెండ్లి కొడుకు తండ్రిపై కేసు నమోదు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో జరిగింది. రంగపేటకి చెందిన శీలం బాపు కొడుకు పెండ్లి ఆదివారం గ్రామంలో జరిగింది. కాగా మండపం వద్ద జనం గుంపులుగా ఉండడంతో తాళ్లగురిజాల ఎస్సై సమ్మయ్య పరిశీలించి బాపుపై కేసు ఫైల్​చేశారు.