ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మెరుగైన వైద్యం కోసమే బస్తీ దవాఖాన్లు
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే గుజరాత్‌లో బీజేపీ విజయం
విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు : వైద్య రంగంలో టీఆర్‌‌ఎస్‌‌ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగిందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేటలోని కుడకుడలో గురువారం బస్తీ దవాఖానాను ప్రారంభించి మాట్లాడారు. చిన్న చిన్న కాలనీల్లో సైతం ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఈ దవాఖానాల్లో పైసా ఖర్చు లేకుండా ట్రీట్‌మెంట్‌, 120 రకాల టెస్టులు చేయడంతో పాటు మందులు సైతం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ హాస్పిటల్స్‌‌‌‌లో డాక్టర్, నర్స్‌తో పాటు సపోర్టింగ్‌‌స్టాఫ్‌ కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌అంటే ప్రజలకు భయం పోయేలా వైద్య రంగాన్ని డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు చెప్పారు. అనంతరం అక్కడే టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుమాండ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టా కిశోర్‌పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయం లేకే గుజరాత్‌లో బీజేపీ విజయం

గుజరాత్‌లో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. మీడియాలో సంచలనాల కోసమే తెలంగాణ, ఏపీ పునరేకీకరణ అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సూర్యాపేటలోని క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ ఎక్కడో పాదయాత్ర చేస్తే ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్‌ ఎదగడం వల్లే ఆ పార్టీ విజయం సాధ్యమైందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం
 చేశారు. 

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలి

యాదాద్రి, వెలుగు : రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చూపి గోల్డ్‌‌‌మెడల్‌సాధించాలని యాదాద్రి అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. 41వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ఖోఖో చాంపియన్‌‌‌‌షిప్‌కు పోటీలకు ఎంపికైన 36 మంది ప్లేయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం పరిచయం చేసుకొని, డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో ప్రతిభ చూపి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో పాల్గొనాలని, ఆటల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధనుంజనేయులు, ఖోఖో అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్లు నాతి కృష్ణమూర్తి, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆంజనేయులు, కురిమిళ్ల ఈశ్వర్‌‌‌‌గౌడ్‌పాల్గొన్నారు.

లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సక్సెస్‌‌ చేయాలి

నల్గొండ అర్బన్‌, వెలుగు : ఈ నెల 12న నల్గొండ జరగనున్న లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర ఖుష్బూ గుప్తా సూచించారు. గురువారం నల్గొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమణాచారితో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలని, స్టూడెంట్లు ఎక్కువగా పాల్గొంటున్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొక్కల పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ ఆఫీసర్లే చూసుకోవాలని చెప్పారు. అనంతరం ఎస్‌ఎల్‌‌‌బీసీ, దేవరకొండ హైవే, ఎస్టీపీతో పాటు మొక్కలు నాటే ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రేమ్‌‌‌కరణ్‌‌రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్‌‌ఆఫీసర్‌‌సల్మాభాను, బీసీడీవో పుష్పలత, మైనార్టీ వెల్ఫేర్‌‌ఆఫీసర్‌బాలకృష్ణ, హార్టికల్చర్‌‌‌ఆఫీసర్‌‌ సంగీతలక్ష్మి పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

నేరేడుచర్ల, వెలుగు : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూర్యాపేట కలెక్టర్‌‌పాటిల్‌‌హేమంత్‌ కేశవ్‌‌ఆదేశించారు. నేరేడుచర్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. హరితహారం కార్యక్రమం నాటికి మొక్కలను రెడీగా ఉంచాలని సూచించారు. పాత నేరేడుచర్ల సమీపంలో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులో స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి నెలా రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్రమంగా వస్తుందా ? లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయదుర్గ ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపన్‌‌ చైర్మన్‌ చందమళ్ల జయబాబు, మున్సిపల్‌కమిషనర్‌‌వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్‌‌కుమార్‌, తహసీల్దార్‌‌సరిత, ఎంపీడీవో శంకరయ్య, ఎంఈవో చత్రునాయక్, ఎంపీవో విజయనిర్మల, ఏపీవో శేఖర్, డీటీ నల్లబోలు  స్రవంతి పాల్గొన్నారు.

ఫిజికల్‌‌టెస్ట్‌‌లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ అర్బన్‌, వెలుగు : కానిస్టేబుల్, ఎస్సై క్యాండిడేట్ల ఫిజికల్‌ ఫిట్‌ నెస్ టెస్ట్‌‌‌లు గురువారం నల్గొండలోని మేకల అభినవ్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. టెస్ట్‌ లను జిల్లా ఇన్‌‌చార్జి ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, స్పెషల్‌‌ఆఫీసర్‌ఎస్పీ శబరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షించారు. గురువారం 600 మంది క్యాండిడేట్లు హాజరుకావాల్సి ఉండగా 483 మంది హాజరయ్యారు. ఇందులో 215 మంది అర్హత సాధించినట్లు ఆఫీసర్లు తెలిపారు. క్యాండిడేట్లు ఇన్‌ టైంలో టెస్ట్‌ లకు హాజరుకావాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ సూచించారు. 

దత్తత తీసుకుంటానని మోసం చేసిన్రు

నల్గొండ అర్బన్‌ వెలుగు : సీఎం కేసీఆర్‌ నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి మోసం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌ ‌‌గౌడ్‌‌ విమర్శించారు. శుక్రవారం నుంచి చేపట్టనున్న బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించి మాట్లాడారు. పానగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పచ్చల సోమేశ్వరాలయం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరవుతారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియంతృత్వ పాలన, ఆయన ఫ్యామిలీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాలీ నిర్వహించి 15న నల్గొండలోని క్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ముగించనున్నట్లు చెప్పారు. పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరాచారి, అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాయం భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మీడియా కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలకూరి రవిగౌడ్, గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని భువనగిరి పోలీసులు గురువారం పట్టుకున్నారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా సేవానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండు గోవిందు చిన్నతనంలోనే ఇంట్లో నుంచి పారిపోయాడు. చెడు అలవాట్లకు బానిస అయిన గోవిందు డబ్బుల కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిధిలో చోరీలు చేస్తుండగా పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. సంగారెడ్డి జైలు నుంచి రెండు నెలల క్రితం విడుదలైన గోవిందు ఈ నెల 4న భువనగిరిలోని కైరంకొండ చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మరో నాలుగు ఇండ్లలో నగలు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ చేశాడు. చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజిమెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రూ. 1.70 లక్షలు, 2 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగలను టోలిచౌకిలోని ఓ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. అతడితో పాటు సహకరించిన ఆలూరి చిన్న, ఎలిగ రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకోగా, కంపెనీ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏరియా మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

ఉర్సుకు హాజరైన హోంమంత్రి

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం నిర్వహించిన ఉర్సుకు హోంమంత్రి మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బహూకరించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉర్సుకు మతాలకతీతంగా కలిసిరావడం ఆనందంగా ఉందన్నారు. దర్గాలో నెలకొన్న సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించేదుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. 

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని భువనగిరి పోలీసులు గురువారం పట్టుకున్నారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా సేవానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బండు గోవిందు చిన్నతనంలోనే ఇంట్లో నుంచి పారిపోయాడు. చెడు అలవాట్లకు బానిస అయిన గోవిందు డబ్బుల కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిధిలో చోరీలు చేస్తుండగా పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. సంగారెడ్డి జైలు నుంచి రెండు నెలల క్రితం విడుదలైన గోవిందు ఈ నెల 4న భువనగిరిలోని కైరంకొండ చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మరో నాలుగు ఇండ్లలో నగలు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ చేశాడు. చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజిమెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రూ. 1.70 లక్షలు, 2 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగలను టోలిచౌకిలోని ఓ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. అతడితో పాటు సహకరించిన ఆలూరి చిన్న, ఎలిగ రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకోగా, కంపెనీ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏరియా మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాలి

సూర్యాపేట/నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ చేపట్టిన పోరుయాత్ర గురువారం సూర్యాపేట, నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, చిట్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీజు బకాయిలను విడుదల చేయాలని, హాస్టళ్లకు సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మండలానికో గురుకులం, నియోజకవర్గానికో కాలేజీ, జిల్లాకో యూనివర్సిటీ కావాలని అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాపులు, వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బార్లు ఏర్పాటు చేస్తోందని ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో గండిచెర్వు వెంకన్న, తన్నీరు రాంప్రభు, బూర మల్సూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్కెనపల్లి జానయ్య, కోడి లింగయ్య, దాసరి వెంకన్న, నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఎద్దులపూరి కృష్ణ, ఎడ్ల మహాలింగం, నడిగోటి సంతోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కడారి దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం

యాదగిరిగుట్ట, వెలుగు : కస్టమర్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పెక్ట్రా కంపెనీ సీఎండీ మరియాల జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడెంలోని స్పెక్ట్రా ప్రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిసార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజల అభిరుచికి తగ్గట్లుగా కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. తమ సంస్థ ద్వారా ఇప్పటికే 5 వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించామని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అంతకుముందు సంస్థ డైరెక్టర్లతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో స్పెక్ట్రా డైరెక్టర్లు గంప అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాక రవికిరణ్, పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝూ, జెనెగ వాసుదేవరావు, పెద్దపల్లి రాజేంద్రప్రసాద్, మైలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడెం ఉప సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారెడ్డి కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. 

‘టీఆర్‌‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగింది’

నకిరేకల్, వెలుగు : ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌పాలనపై ప్రజల్లో అసంతృ-ప్తి, వ్యతిరేకత పెరిగందని  టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 సోనియాగాంధీ పుట్టిన రోజును నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీసీసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంకరబోయిన నర్సింహయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు జటంగి వెంకటనర్సు, లింగాల వెంకన్న, నకిరేకంటి శ్రీను, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

దేవరకొండ, వెలుగు : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం పలువురు వికలాంగులకు ట్రైసైకిళ్లు, మోపెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన పలువురు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఏ పల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్గూరి వల్లపురెడ్డి, కంకణాల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, సైదులు, జయప్రకాశ్‌‌నారాయణ, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

హుజూర్‌ నగర్‌ , వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వడ్లు అమ్ముకోవాలని సూర్యాపేట జిల్లా వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గజవెల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. వేపలసింగారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. తుఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున వడ్ల కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంజయ్య, ఆడిటర్లు బడే సాబ్, ఏఈవో సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి 

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ జిల్లాలో జరిగిన అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొందరు టీచర్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కువిరుద్ధంగా డీఈవో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారని ఆరోపించారు. వీటిని రద్దు చేయాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జి.నాగమణి, వై.సైదులు, రత్నయ్య, ఖుర్షిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మియా, వెంకటేశం పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

మిర్యాలగూడ, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో వట్టికోటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పద్మ (38) దంపతులు ఉంటున్నారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేవాలని పద్మ కుమార్తెను బయటకు పంపించి ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుమార్తె తల్లి ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి 108కు సమాచారం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

మిర్యాలగూడ, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో వట్టికోటి శ్రీనివాస్‌, పద్మ (38) దంపతులు ఉంటున్నారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేవాలని పద్మ కుమార్తెను బయటకు పంపించి ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుమార్తె తల్లి ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి 108కు సమాచారం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పథకాలను చూసే పార్టీలో చేరుతున్రు

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : టీఆర్‌ఎస్‌‌ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌రెడ్డి అన్నారు. తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన సర్పంచ్‌మైనం నాగయ్య, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొంత రాములుతో పాటు పలువురు నాయకులు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్‌చైర్మన్‌మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌చైర్మన్‌పాశం సంపత్‌‌రెడ్డి, గొల్లగూడ చైర్మన్‌నాగరత్నం రాజు పాల్గొన్నారు.

ప్రయోగాలపై ఆసక్తి పెంచుకోవాలి

యాదాద్రి, వెలుగు : శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలపై స్టూడెంట్లు ఆసక్తి పెంచుకోవాలని ఐఐసీటీ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, యాదాద్రి డీఈవో నారాయణరెడ్డి సూచించారు. రాయగిరిలో జరుగుతున్న సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గురువారం నిర్వహించిన మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. స్టూడెంట్లు చిన్నప్పటి నుంచే సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్ల అభిరుచి పెంచుకోవాలని సూచించారు. రామానుజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణ, సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సహదేవులు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగాలి

నల్గొండ అర్బన్‌, వెలుగు : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొల్లేటి గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. జీవశాస్త్రాల్లో ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణపై ఎంజీయూలో నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశానికి యువ శాస్త్రవేత్తలు అవసరం ఉందన్నారు.