ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

కాంట్రాక్టర్లు పనులు చేస్తలే...
ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌ గొంగిడి సునీత దృష్టికి తీసుకొచ్చిన ఆఫీసర్లు

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : ఎంత ఒత్తిడి చేసినా కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణం, రిపేర్‌‌‌‌‌‌‌‌ పనులు చేయడం లేదని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల రిపేర్లు, బ్రిడ్జీలు, డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల నిర్మాణంపై బుధవారం ఆఫీసర్లతో ఆమె రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల రిపేర్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట నుంచి చేర్యాల వరకు డబుల్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పనులు మంజూరై ఐదేళ్లు గడుస్తున్నా ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనగామ జిల్లా వైపున పనులు చేసిన కాంట్రాక్టర్లు యాదాద్రి జిల్లా వైపున స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తలేరని ఆఫీసర్లు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలేరు, తుర్కపల్లి, కొలనుపాకలో పూర్తైన డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లను డీఆర్డీవోకు అప్పగించాలని ఆదేశించారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కరెంట్‌‌‌‌‌‌‌‌, డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ, పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈలు నర్సింహానాయక్‌‌‌‌‌‌‌‌, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, ఆఫీసర్లు బీల్యానాయక్‌‌‌‌‌‌‌‌, సెహనాజ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. 

  • గవర్నర్‌‌‌‌‌‌‌‌ తీరు సరిగా లేదు
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

మునుగోడు, వెలుగు : రాష్ట్రంలో గవర్నర్‌‌‌‌‌‌‌‌ తీరు సరిగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీకి బుద్ధి చెప్పేలా మునుగోడు ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని, కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. రామగుండంలో మోడీ పర్యటనపై నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా  ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించగా పోలీసులు తిప్పికొట్టారన్నారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎండీ.జహంగీర్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాల్గొన్నారు.

కాలుష్య కంపెనీలను తరలించాలి

యాదాద్రి, వెలుగు : కంపెనీలు కాలుష్యం వెదజల్లుతుంటే సర్కార్​ ఏం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. గాలి, నీటి కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా బీబీనగర్​ మండలం కొండమడుగులో కాలుష్యం వెదజల్లుతున్న మూడు కంపెనీలను ఎత్తివేయాల డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రజలు చేస్తున్న దీక్షకు బుధవారం ఆయన మద్ధతు పలికారు. ఈ సందర్భంగా కంపెనీ ఓనర్‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. కంపెనీని తరలించాలని, రెసిడెన్షియ్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ వంటివి నిర్మిస్తే తాను సహకరిస్తానని చెప్పారు. గురువారం మళ్లీ వచ్చి కంపెనీ తరలింపును పరిశీలిస్తానని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండమడుగును ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ నుంచి తొలగించి రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రజలు నిర్వహించే ఆందోళనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ పక్కన రూ. 250 కోట్లతో స్పోర్ట్​ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ. 90 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఎంఎంటీఎస్‌‌‌‌‌‌‌‌ విస్తరణ ఆగిపోయిందన్నారు.

హ్యాండ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హ్యాండ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ మహిళల ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికను బుధవారం నల్గొండలోని మేకల అభినవ్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ప్రారంభించారు. ఈ ఎంపిక పోటీలను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఎంతో గుర్తింపు ఉన్న హ్యాండ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. హ్యాండ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు నకిరేకల్‌‌‌‌‌‌‌‌ మండలం మంగళపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాలని చెప్పారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌‌‌‌‌‌‌‌, ఫిజికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ టీచర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (పెటా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్, డీఎస్‌‌‌‌‌‌‌‌వైవో మగ్బూల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, అక్బర్, రామాంజనేయులు, వరమ్మ, పార్వతి పాల్గొన్నారు. అనంతరం నల్గొండ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్‌‌‌‌‌‌‌‌ డొనేషన్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ రాజాకుమారి, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ లచ్చూనాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

అగ్నిపథ్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించాలి

సూర్యాపేట, వెలుగు : ఆగ్నిపథ్‌‌‌‌‌‌‌‌ స్కీంపై స్టూడెంట్లకు అవగాహన కల్పించి వారు సైన్యంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ అయిందని, ఈ నెల 23 లోపు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అప్లై చేసుకోవచ్చన్నారు. ఈ ఉద్యోగాలపై  స్టూడెంట్లకు అవగాహన కల్పించి, వారు అప్లై చేసేలా ఆఫీసర్లు ప్రయత్నించాలని చెప్పారు. అప్లికేషన్‌‌‌‌‌‌‌‌, ఇతర వివరాల కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో చూడాలని చెప్పారు. అప్లై చేసుకున్న వారికి డిసెంబర్ 18 నుంచి 24 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు.

అభివృద్ధి పథకాల వివరాలు ఇవ్వండి

యాదాద్రి, వెలుగు : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని యాదాద్రి అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ​ ఈ రికార్డులను ఈ నెల 14 లోగా అందజేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలు వచ్చాక ఒకే విధమైన ప్రొఫార్మాలో బుక్స్‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌‌‌‌‌ చేయించాలన్నారు. ఈ బుక్స్‌‌‌‌‌‌‌‌ కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ రాసే క్యాండిడేట్లకు, రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ స్కాలర్స్, ప్లానర్స్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగపడుతాయన్నారు. సీపీవో మాన్యా భూక్యానాయక్, డీఎస్‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏవో నాగేశ్వరాచారి, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు యాదయ్య, జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

తూకంలో మోసం చేస్తే ఊరుకోం

భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, వెలుగు : వడ్ల తూకంలో మోసం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ గూడూరు నారాయణరెడ్డి హెచ్చరించారు. యాదాద్రి జిల్లా భూదాన్‌‌‌‌‌‌‌‌ పోచంపల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్లు తూకంలో మోసం చేస్తున్నారని, గన్నీ బ్యాగు బరువుతో కలిపి 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 600 గ్రాములు అదనంగా వేస్తున్నారని రైతులు ఆయనకు వివరించారు. దీంతో ఆయన కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతికి ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి సమస్యను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిల్లర్లు రైతులను మోసం చేయడం సరికాదని, రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం వడ్లను తూకం వేయాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు సురకంటి జంగారెడ్డి, బస్వలింగం, కృష్ణ, రాంరెడ్డి ఉన్నారు.