ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆటలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

సూర్యాపేట వెలుగు : క్రీడలు ఆత్మవిశ్వాసం పెంచి, జీవితంలో విజయం సాధించేందుకు తోడ్పడుతాయని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. స్టూడెంట్లు పుస్తకాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ పాల్గొనాలని సూచించారు. సూర్యాపేటలోని ఎస్‌‌‌‌‌‌‌‌వీ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీఈటీల ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే అనేక జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఆట వస్తువులు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన భానుపురి ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఫిల్లింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ ఎమెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, డీసీఎంఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వట్టె జానయ్యయాదవ్, జడ్పీవ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గోపగాని వెంకటనారాయణగౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, జడ్పీటీసీ జీడీ భిక్షం పాల్గొన్నారు. 

చదువు ప్రాధాన్యతను తెలిపిన వ్యక్తి పూలే.. 

జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని ఆయన విగ్రహానికి సోమవారం మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌ పూలమాల  వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే ఎంతో కృషి చేశారన్నారు. పూలే స్ఫూర్తితో తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి పేదలకు సైతం కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ విద్యను అందజేస్తున్నట్లు చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి

నల్గొండ, వెలుగు : రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవంబిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని కిసాన్‌‌‌‌‌‌‌‌ మహాసభ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్ఞు కృష్ణన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండలో జరుగుతున్న రైతు సంఘం రెండో మహాసభలో సోమవారం ఆయన మాట్లాడారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ బిల్లును కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపజేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, రుణ విముక్తి చట్టం తీసుకురావాలన్నారు. అంతకుముందు మహాసభల జెండాను ఏఐకేఎస్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అమరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు అన్నన్‌‌‌‌‌‌‌‌మల్ల, జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, చంద్రారెడ్డి, శోభన్, శ్రీశైలం, సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వీరారెడ్డి, నాగార్జున పాల్గొన్నారు. 

చిట్యాల మున్సిపాలిటీలో అన్ని వసతులు కల్పిస్తాం

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో అన్ని వసతులు కల్పిస్తామని నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. చిట్యాల పట్టణంలో చేపట్టిన డ్రైనేజీ పనులకు సోమవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న ప్రతి పథకం దేశానికే ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ కొలను సునీత వెంకటేశంగౌడ్, మార్కెట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జడల ఆదిమల్లయ్య, జడ్పీటీసీ ధనమ్మ, మండల అధ్యక్షుడు ఐలయ్య, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

అన్వితారెడ్డి విజయాలు యువతకు ఆదర్శం

యాదాద్రి, వెలుగు : పర్వతారోహకురాలు అన్వితారెడ్డి సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణం అని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి చెప్పారు. ఎవరెస్ట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆరు పర్వతాలను అధిరోహించిన అన్వితను, కోచ్‌‌‌‌‌‌‌‌ శేఖర్‌‌‌‌‌‌‌‌బాబును సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సన్మానించి, మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ అన్విత సాధించిన విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో విన్సన్ పర్వతారోహణకు వెళ్తున్న అన్వితకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, ఏవో ఎం.నాగేశ్వరాచారి, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కేవీ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.

అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలి

మఠంపల్లి, వెలుగు : అర్హులందరికీ దళితబంధు పథకం అమలు చేయాలని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామస్తులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు సోమవారం మఠంపల్లి – హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ బినామీలు, అనర్హులకు దళితబంధు పథకాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ స్పందించి అవకతవకలపై ఎంక్వైరీ చేయాలని, అర్హులైన వారికి దళితబంధు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్రు

యాదగిరిగుట్ట, వెలుగు : దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌‌‌‌‌‌‌‌ జీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. కార్పొరేట్లకు సంబంధించిన రూ. 10 లక్షల కోట్ల లోన్లను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం, చిన్నాచితక లోన్లు తీసుకున్న పేదలను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు సోమవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించి, పలు తీర్మానాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి  వచ్చినప్పటి నుంచి ట్రేడ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లను నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక సంఘాలను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు మేలు చేసేలా కార్మిక, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలరాజు, బోస్, యూసఫ్, మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌ గోద శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్, ఆహ్వాన సంఘం నాయకులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ పాల్గొన్నారు.

తెలంగాణను అప్పులకుప్పగా మార్చిన్రు

సూర్యాపేట, వెలుగు : విభజన టైంలో మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది సీఎం కేసీఆరేనని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన వార్డువార్డుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు 15 తర్వాతే జీతాలు ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏళ్లు గడుస్తున్నా అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంతో మురుగు నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోందన్నారు. మంత్రి అండదండలతో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ల్యాండ్‌‌‌‌‌‌‌‌, శాండ్‌‌‌‌‌‌‌‌ మైనింగ్ మాఫియాకు సూర్యాపేట అడ్డాగా మారిందన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల కోసం 15 వేల మందికి పైగా అప్లై చేసుకుంటే కేవలం 192 మందికే పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో పగిళ్ల శరత్, ముదిరెడ్డి రమణారెడ్డి, షఫీ ఉల్లా, పాలవరపు వేణు, చొక్కయ్య, స్వామినాయుడు, ఫరూక్‌‌‌‌‌‌‌‌, గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, గట్టు శ్రీనివాస్, వల్దాస్‌‌‌‌‌‌‌‌ దేవేందర్‌‌‌‌‌‌‌‌, సైదిరెడ్డి పాల్గొన్నారు.