
హైదరాబాద్, వెలుగు: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సమయంలో, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, హైదరాబాద్ సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో ప్రత్యేకంగా 'బ్రైడల్ జ్యువెలరీ షో'ను నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల10 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. వధువుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సరికొత్త, సంప్రదాయ సమకాలీన నగల కలెక్షన్లను ఈ షోలో ప్రదర్శిస్తారు.
వజ్రాలు, బంగారం, ప్లాటినం ఇతర విలువైన రాళ్లతో పొదిగిన నెక్లెస్‌లు, చెవిదుద్దులు, గాజులు, వడ్డాణాలు వంటి అనేక రకాల ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. పెళ్లికి సిద్ధమవుతున్న వధువులు, వారి కుటుంబ సభ్యులకు ఇది ఒక చక్కటి అవకాశమని, ఈ ప్రత్యేక ప్రదర్శనలో అభిరుచికి తగిన ఆభరణాలను ఎంచుకోవచ్చని మలబార్ గోల్డ్ తెలిపింది. ఈ సందర్భంగా కస్టమర్లకు నగల కొనుగోలుపై పలు ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొంది.